విజయవాడ

వీఎంసీ ఖాళీ స్థలాల పరిరక్షణకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 23: నగర పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీ స్థలాల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని మే యర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం తన ఛాం బర్‌లో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో రాబోయే రోజు ల్లో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రజాప్రయోజనకరమైన పను లు, నిర్మాణాలు చేపట్టేందుకు ఖాళీ స్థ లాలు అవసరం ఉన్నందున ప్రస్తుతం వాడుకలో లేకుండా నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత ఆయా స్థలాలను గుర్తించి వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల దురాక్రమణ జ రగకుండా అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించిన మేయర్, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక అందించాలన్నారు. ఈ సమావేశంలో సీఈ పీ ఆదిశేషు, సిటీ ప్లానర్ బీ లక్ష్మణరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ బీ ధర్మారావు, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ పద్మావతి, సర్వేయర్ జగన్మోహనరావు, మేనేజర్ ఏ నాగకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్ ఫోరంలో 3 దరఖాస్తులకు అనుమతి
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 23: సీఆర్‌డీఏ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరంలో 3 దరఖాస్తులకు తక్షణ అనుమతులను మంజూరు చేశారు. శుక్రవారం నగరంలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగిన ఈకార్యక్రమంలో కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ స్వయంగా పాల్గొని దరఖాస్తులను పరిశీలించారు. మొత్తం 14 దరఖాస్తులు రాగా వీటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న 3 దరఖాస్తులకు ప్రాథమికంగా తక్షణ అనుమతులు మంజూరు చేయగా 10 దరఖాస్తులకు అదనపు సమాచారం కోరారు. మరో దరఖాస్తును తిరస్కరించారు. లేఅవుట్ అనుమతి కోసం వచ్చిన 6 దరఖాస్తులలో ఒక దానిని ఆమోదించారు. 4 దరఖాస్తులకు అదనపు సమాచారం కోరగా, ఒక దానిని తిరస్కరించారు. ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ కోసం వచ్చిన 2 దరఖాస్తులలో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న ఒకదానిని ఆమోదించి మరో దానికి అదనపు సమాచారం కోరారు. ఎన్‌వోసీ కోసం వచ్చిన ఓక దరఖాస్తును ఆమోదించారు. ఎక్స్‌న్షన్ ఆఫ్ టైమ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ లే అవుట్ కోసం వచ్చిన 5 దరఖాస్తులకు అదనపు సమాచారం కోరారు. ఈకార్యక్రమంలో సీఆర్‌డీఏ డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ కే నాగసుందరి, జాయింట్ డైరెక్టర్లు కే ధనుంజయరెడ్డి, బీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.