విజయవాడ

అటపాక పక్షుల కేంద్రంలో విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: ఆటపాక పక్షుల కేంద్రంలో పర్యాటకులకు వౌలిక సదుపాయాలతోపాటు పక్షులకు అవసరమైన వసతి చర్యలను చేపట్టాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆటపాక పక్షుల కేంద్రంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతం మాట్లాడుతూ పాత బోట్లు స్థానే పర్యాటకులకు కొత్త బోట్లను ఏర్పాటు చేయాలని, పక్షులు విడిది చేసే స్టాండ్లను అవసరమైన మేరకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. పక్షుల సంరక్షణ కేంద్రం వద్ద రోడ్లను అభివృద్ధి చేయాలని పక్షుల సమాచారాన్ని తెలిపే కేంద్రంలో సౌకర్యాలతోపాటు భవనానికి రంగులు వేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆటపాక పక్షుల కేంద్రాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా డీఎఫ్‌వో, ఆర్‌డీవో అవసరమైన పనులు చేపట్టాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు.

నగరంలో కాలుష్యం నివారణకు పలు రకాల చర్యలు
* కలెక్టర్ లక్ష్మీకాంతం

విజయవాడ, ఫిబ్రవరి 23: నగరంలో కాలుష్య స్థాయి తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. నైట్రక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్‌లు సాధారణంగా 80 మైక్రాన్ గ్రాములు ఉంటుందన్నారు. ఈ స్థాయి కంటే నగరంలో కాలుష్యం తక్కువగానే నమోదు అవుతున్నాయన్నారు. అదే విధంగా కార్బన్ మోనాక్సైడ్ 4 మైక్రా గ్రాములు ఉండాలన్నారు. ఆ స్థాయి కంటే బెంజిసర్కిల్ లాంటి ప్రాంతాల్లో తక్కువగా నమోదు అవుతుందన్నారు. వాహనాలు, ఇతరేతర కారణాలతో కాలుష్యస్థాయి విలువలు మారుతుంటాయన్నారు. విజయవాడ నగరంలో తీసుకుంటున్న చర్యలు వలన కాలుష్య శాతం సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదవుతుందని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.

మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ మేరకు దీక్ష విరమించిన హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు

విజయవాడ, ఫిబ్రవరి 23: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్న ఉద్యోగ సంఘ ప్రతినిధులతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ శుక్రవారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, విద్యాసాగర్‌తోపాటు హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు తమ సమస్యలపై మంత్రి కామినేని శ్రీనివాస్ చర్చించారు.
హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగుల డిమాండ్లపై ఈ సమావేశంలో ప్రధానంగా యూనివర్సిటీ నిధుల సంరక్షణకు ప్రత్యేకంగా జీవో త్వరలో విడుదల చేయాలని, అమరావతిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఆర్డీఏ ద్వారా స్థలం కేటాయించాలని, యూనివర్సిటీకి కేటాయించే గ్రాంట్‌ను రూ.6 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచాలని ఉద్యోగులు కోరారు. యూనివర్సిటీ అడ్‌హాక్ ఉద్యోగుల జీతాల పెంపుదలపై మంత్రి కామినేని సానుకూలంగా స్పందించిన చర్చల మేరకు సంతృప్తి చెందిన ఉద్యోగులు దీక్షను విరమించి రేపటి నుండి విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కామినేని శ్రీనివాస్‌తోపాటు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, విద్యాసాగర్, ఇక్బాల్, జగదీష్, హెల్త్ యూనివర్సిటీ పరిరక్షణ ఉద్యోగ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

ముస్లింల సంక్షేమం కోరుతూ 25న ర్యాలీ, ధర్నా
* ముస్లిం ఐక్యవేదిక నేతలు వెల్లడి
విజయవాడ, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడ్డ ముస్లింల సంక్షేమాన్ని కోరుతూ ముస్లిం ఐక్యవేదిక క్రిస్టియన్ రైట్స్ ప్రొటక్షన్ సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 25తేదీ ర్యాలీ అనంతరం ధర్నా చౌక్‌లో ధర్నా జరుపనున్నామని ఐక్యవేదిక కార్యాలయం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఐక్యవేదిక లీగల్ సెల్ చైర్మన్ పూనూరి గౌతంరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కె జలీల్ తెలిపారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలన్నింటిని కేంద్రం తుచ తప్పక అమలు చేయాలన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో నేటి వరకు ఒక ముస్లింకు కూడా ప్రాధాన్యత లేకపోవడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు బాబుకు తగిన బుద్ధి చెప్పగలరని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రషీద్, ప్రచార కార్యదర్శి వాజీవ్‌ఖాన్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.