విజయవాడ

పరస్పర దాడికి సిద్ధమైన వైసిపి, టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూన్ 10: ఒకే రోడ్డు ఒకేవైపు కొంచెం దూరంలో తెలుగుదేశం.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు! వైసిపి నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుతమ్ముళ్లు ఒక్కొక్కరిగా చేరుతున్నారు. కొంత సేపటికి ఇరు పార్టీ కార్యాలయాలు కార్యకర్తలతో నిండిపోయి ఉన్నాయి. ఉన్నట్టుండి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైసిపి కార్యాలయం వైపు వేగంగా వస్తున్నారు. దీంతో తమ పై దాడికి వస్తున్నారనుకున్న వైసిపి నేతలు సైతం ఎదురు దాడికి సిద్ధమై రోడ్డుపై నిల్చున్నారు. ఇంతలో నున్న గ్రామీణ పోలీసుస్టేషన్ ఎస్సై శివప్రసాద్ అప్రమత్తమైయ్యారు. తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. అసలు తెలుగుదేశం నేతలు ఎందుకు వస్తున్నారో తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్లి ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. వైసిపి నేతలు తమ ఎమ్మెల్యే బొండా ఉమ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని, దానిని అడ్డుకునేందుకు వెళ్తున్నట్లుగా తెలుగుతమ్ముళ్లు బదులిచ్చారు. దీంతో విషయం అర్థమైన ఎస్సై శివప్రసాద్ వైసిపి నేతలు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం లేదని, కేవలం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారనీ, డివిజన్ ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు రాధా వచ్చినట్లుగా తెలియజేశారు. ఎందుకైనా మంచిదనే భావనతో మరోసారి వైసిపి నేత రాధా దగ్గరకు వెళ్లి దిష్టిబొమ్మ దగ్ధం గురించి వివరణ కోరగా తాము అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయడం లేదనీ, తెలుగుదేశం నేతలు దాడికి వస్తే తాను సిద్ధమేనని బదులిచ్చారు. దీంతో ఇరువర్గాలను శాంతింపజేసిన ఎస్సై బృందం ఇరు పార్టీల నేతల్ని పంపించివేశారు. దీంతో ఉత్కంఠ వాతావరణం కాస్తా చల్లబడింది. ఎస్సై ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా పరిస్థితుల పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవనడంలో ఎటువంటి సందేహం లేదు.