విజయవాడ

గిరిజన జాబితాల్లో ఇతర కులాలను చేర్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 25: వాల్మీకి బోయలను ఆదివాసి (ఎస్టీ) జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని తక్షణం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి 11నుండి 23వరకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన చైతన్య యాత్రలు చేపడుతున్నామని అనంతరం మార్చి 31న నగరంలో లక్షలాది మందితో గిరిజన శంఖారావం సభ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గిరిజన హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం తెలిపారు. ఆదివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన జాబితాలో ఇతర కులాలకు చేర్చాలనే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందని గిరిజన జాబితాలోకి ఇతర కులాలను చేర్చాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్టవ్య్రాప్తంగా 75వేల గిరిజన నిరుద్యోగులు డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగాలు లభించక పోవడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందక అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన బోయలను కేవలం రాజకీయ స్వార్థం కోసం గిరిజన జాబితాలో చేర్చాలని నిర్ణయించడం దారుణమన్నారు. నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాయమని హెచ్చరించారు. ఈసమావేశంలో మాజీ శాసనసభ్యులు నిమ్మక జయరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా గోవిందు, విష్ణునాయక్, రామస్వామి, వెంకటరమణ నాయక్, రమేష్, రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.