విజయవాడ

సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యక్ష కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని వామపక్షాలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, జనసేన పార్టీలు ప్రకటించాయి. ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు, సీపీఐ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, జనసేన నాయకులు పోతిన మహేష్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పోలారి, రామారావు, లిబరేషన్ నాయకులు హరినాథ్, ఎంసీపీఐయూ నాయకులు గొల్లపూడి ప్రసాద్ తదితరులు మాట్లాడారు. విద్యుత్ కార్మికుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 24వేల మంది కార్మికులు 20 నుండి సమ్మెలోకి దిగారని తెలిపారు. సీఎం ఇచ్చిన వాగ్దానాలను మాత్రం నెరవేర్చలేదన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, ప్రపంచంలో ఎక్కడా లేని సిద్ధాంతాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, కొత్త కొత్త చట్టాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ కలిసి విన్నవించారని అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావుకు విద్యుత్ శాఖపై ఏ మాత్రమూ పట్టులేదన్నారు.
బీజేపీది దొంగనాటకం
వెనుకబడిన తెలంగాణా, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఏడాదికి రూ.50కోట్లు చొప్పున 7 జిల్లాలకు రెండేళ్లపాటు నిధులిచ్చి చేతులు దులిపేసుకుందని, ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో దొంగ నాటకాలాడుతోందని, ఇదే పద్ధతి కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాయలసీమలో అడ్వకేట్స్ ఆందోళనపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు.

విశాఖ భాగస్వామ్య సదస్సులో
ఆకట్టుకుంటున్న ఏపీ సీఆర్‌డీఏ స్టాల్
విజయవాడ, ఫిబ్రవరి 25: విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పారిశ్రామిక సదస్సు-2018 వేదిక దగ్గర ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో ఏపీసీఆర్‌డీఏ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందర్శకుల రద్దీతో సందడి ఉంది. కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ప్రత్యేక శ్రద్ధతో ఏపీసీఆర్‌డీఏ స్టాల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దడం జరిగింది. దేశ, విదేశీ ప్రతినిధులను ఏపీసీఆర్‌డీఏ స్టాల్ ఎంతో ఆకట్టుకుంటోంది. వర్చ్యువల్ రియాలిటీ ఎఫెక్ట్‌తో ఏర్పాటుచేసిన అమరావతి రాజధాని త్రీడీ మోడల్ ఎంతో అలరిస్తోంది. అంతేకాకుండా బ్యాక్‌లైట్ ఎఫెక్ట్‌తో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో పొందుపరిచిన రాజధాని విశేషాల సమాచార చిత్రమాలిక సందర్శకుల్ని కట్టిపడేస్తోంది. దీంతోపాటు స్టాల్‌లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి దానిపై అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్, ఐజీసీ, ప్రభుత్వ హౌసింగ్, రోడ్లు ఇతర నిర్మాణ కార్యక్రమాలతో రూపొందించిన ప్రత్యేక వీడియో ప్రదర్శన చేయడం జరుగుతోంది.
అంతేకాకుండా అమరావతి రాజధాని ప్రభుత్వ నగర మాస్టర్‌ప్లాన్ సందర్శకుల్ని అలరిస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐకానిక్ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టు నమూనాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్, స్పెషల్ కమిషనర్ వీ రామమనోహరరావు సందర్శకులకు స్వయంగా అమరావతి విశేషాలను తెలిపారు. అమరావతి రాజధాని విశేషాల సమాచార కిట్ కోసం సందర్శకులు బారులు తీరుతున్నారు. విశాఖ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు విచ్చేసిన సందర్శకులంతా అమరావతి రాజధాని నిర్మాణ కార్యకలాపాలను ప్రశంసించడం జరుగుతోంది.