విజయవాడ

ఇందిరాగాంధీ రాజకీయవేత్త కాదు ..ప్రకృతి ప్రేమికురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 25: ఇందిరాగాంధీ రాజకీయవేత్త కాదు... ప్రకృతి ప్రేమికురాలు, పర్యావరణవేత్త అని మాజీ కేంద్ర మంత్రి, గ్రంథ రచయిత జైరాం రమేష్ అన్నారు. ఆదివారం బందరు రోడ్డులోని ఏ కనె్వన్షన్ సెంటర్‌లోజరిగిన ఇందిరాగాంధీ ఒక ప్రకృతి ప్రేమికురాలి జీవితం అనే గ్రంథావిష్కరణలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాను మూడో గ్రంథాన్ని రాయడం జరిగిందని, మొదటిది పీవీ నరసింహరావు మొదటి 75రోజుల ప్రభుత్వ పాలన మీద, రెండవది ఆంధ్రప్రదేశ్ విభజనపై, మూడోది ఇందిరాగాంధీ పుస్తకమన్నారు. తాను రచించిన పుస్తకాలను గ్రంథ అనువాదకుడు ఏ కృష్ణారావు అనువదించగా ప్రింటింగ్ ఎమెస్కో విజయకుమార్ చేయడం జరిగిందన్నారు. రియల్ ఇందిరాగాంధీ రాజకీయాల్లో స్వేచ్ఛగా లేరని, ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించడంలో ఉన్నారన్నారు. ఇందిరాగాంధీ పర్యావరణాన్ని పరిరక్షించడంలో మొదటి, చివరి ప్రధాని అని పేర్కొన్నారు. ప్రతిరోజు రాజకీయంగా ఎంత ఒత్తిడులు ఉన్నప్పటికీ పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడటంలో ముందుడేవారన్నారు. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది.. ప్రకృతిని నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేస్తుందని, బెంగుళూరు నుండి మైసూరు వరకు కారులో వెళ్తూ చెట్ల పేర్లను పీవీ నరసింహరావుకు చెబుతూ, కారు దిగి అక్కడే ఉన్న వారందరినీ కలవడం జరిగిందన్నారు. పుస్తకాన్ని ప్రముఖ రచయిత తల్లావజ్ఞుల పతంజలి శాస్ర్తీ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్, గ్రంథ అనువాదకుడు ఏ కృష్ణారావు, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమెస్కో విజయకుమార్, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.