విజయవాడ

బీజేపీ రాజాపై మరో వేటుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: నగరంలో ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు నూజివీడుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ లక్ష్మీపతిరాజాపై మరో వేటు వేసేందుకు ప్రత్యర్థి వర్గం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీజేపీపై చేస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో వాటిని తిప్పికొట్టడానికి బస్సు యాత్ర చేపట్టాలని, రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో ఇది జరగాలని డిమాండ్ చేయడంతో కంగుతిన్న ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు లక్ష్మీపతిరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రీతిలో రాజా కూడా బదులివ్వడం ఈ సంఘటన మొత్తం ప్రసార మాధ్యమాలు పత్రికల ద్వారా ప్రచారం జరిగి రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించింది. 24గంటల వ్యవధిలోనే లక్ష్మీపతి రాజా తమ పార్టీ అధికార ప్రతినిధి కాదని ఆయనను టీవీ చర్చలకు ఆహ్వానించొద్దని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ పేరుతో ఆయా ఛానెల్స్ సీఈఓలకు లేఖలు వెళ్లాయి. అంతటితో సంతృప్తి చెందని ఒక వర్గం జిల్లా పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యులతో సంతకాల సేకరణ చేసి రాజాను సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాలను తయారు చేశారు. మార్చి 2న జిల్లా సమావేశం, కేంద్రంలో కాకుండా నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. దీనికి హరిబాబుని ముఖ్యఅతిథిగాను, సోము వీర్రాజు, పురంద్రీశ్వరీలను అతిథులుగా పిలుస్తున్నారు. సమావేశం చివరిలో లక్ష్మీపతి రాజా ప్రాతినిధ్యం వహించే నూజివీడు ప్రాంత కార్యకర్తలతో రాజాకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శన, దానికి మద్దతుగా మరికొన్ని ప్రాంతాల వారితో నిరసన ప్రదర్శనలు చేయించి మీడియా సాక్షిగా మరోసారి పోయిన పరువు, జరిగిన నష్టం నుండి లబ్ధిపొందాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి దీటుగా అస్సలు జిల్లా అధ్యక్షుడిని నిబంధనలను తుంగలో తొక్కి ఏకపక్షంగా ఎంపిక చేశారని దానిని రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్‌ను సాధించుకోవడానికి వ్యతిరేక వర్గం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా హరిబాబు ఎన్నికై మూడేళ్లు గడుస్తున్నా నేటికీ కనీసం రాష్ట్ర కమిటీ ఏర్పాటు కాకపోవటాన్ని ఓ వర్గం తెరపైకి తెస్తోంది. ఏదిఏమైనా బీజేపీలో భగ్గుమన్న విభేదాలు ఎటువైపు వెళ్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.