విజయవాడ

వాయిదా తీర్మానాల తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: రెండు వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించక పోవడంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో నిరసన వ్యక్తం చేశారు. సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు వేతనాలు పెంచాలని, దీనిపై చర్చించాలని సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు మంగళవారం వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. అయితే దీన్ని మండలి చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూఖ్ తిరస్కరించారు. వేతనాలు పెంచాలని ప్లానింగ్ అడ్వయిజరీ బోర్డు సిఫారుసు చేసినప్పటికీ అమలు చేయడం లేదని నాగేశ్వరరావు ఆరోపించారు. చర్చకు అనుమతించాలంటూ ఆయన వెల్ వద్ద బైఠాయించారు. ఆయనకు మద్దతుగా సభ్యులు కత్తి నర్సింహారెడ్డి, వై శ్రీనివాసులరెడ్డి, సూర్యారావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ అంశంపై చర్చించాలని కోరారు. వేతనాలు పెంచి తరువాత తగ్గించారని, దీనిపై చర్చించాలని డిమాండ్ చేశారు. వేరే ఫార్మాట్‌లో రావాలని, వాయిదా తీర్మానంపై చర్చ లేదని చైర్మన్ స్పష్టం చేశారు. ప్రకాశంను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని కోరుతూ వీరందరూ మరో వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై కూడా చర్చకు అనుమతించక పోవడంతో సభ్యులు మరోసారి వెల్ వద్ద నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, అక్రమంగా కొందరిని అరెస్టు చేశారని ఆరోపించారు. ‘గొంతు నొక్కేస్తారా? వారేమైనా బందిపోటు దొంగలా?’ అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే నిర్లక్ష్యానికి గురైన జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని, ఇది కార్యరూపం దాల్చేవరకూ తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. అరెస్టుల వల్ల ప్రభుత్వ పరువు పోతోందన్నారు. దీన్ని కూడా మరో విధానంలో చర్చకు వీలుగా ప్రతిపాదన ఇవ్వాలని చైర్మన్ సూచించారు. సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒక ప్రశ్నకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బదులివ్వడం ప్రారంభించడంతో పీడీఎఫ్ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లిపోయారు.