విజయవాడ

ఇంటర్ పరీక్షకు 2514 మంది గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 13: ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్, సోషీయాలజీ, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 65,751 మంది విద్యార్థులకు గాను 63,237 మంది పరీక్షలకు హాజరయ్యారు. 2514 మంది గైర్హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించబోమని విద్యాశాఖ ప్రకటించటంతో అందరూ సకాలానికే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థుల పరీక్షల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు, పోలీస్, ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
ఎటువంటి పరీక్షలు రద్దు కాలేదు...ఆర్‌ఐఓ
ఈనెల 8న జరిగిన ఇంటర్ ప్రధమ సంవత్సరం మ్యాథ్స-1బి, హీస్టరీ, బోటనీ పరీక్షలు రద్దు చేసి మరల ఈనెల 15న నిర్వహించనున్నారని మంగళవారం సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ కావడంతో ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐఓ శివ సత్యనారాయణరెడ్డి స్పందిస్తూ ఇప్పటి వరకు ప్రధమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి పరీక్షలు రద్ధు చేయడం జరగలేదని వదంతులను ఎవ్వరూ నమ్మవద్దని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నీ చాలా ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జరిగాయని పేర్కొన్నారు.

అక్రమ లేఅవుట్లు, భవన నిర్మాణాల తొలగింపు
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 13: రాజధాని రీజియన్ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రణాళికాబద్ధ అభివృద్ధికి విరుద్ధంగా ఉన్న అక్రమ లేఅవుట్లు, అనధికార నిర్మాణాలను ఏపీసీఆర్‌డీఏ అధికారులు తొలగించారు. కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆదేశాల మేరకు మంగళవారం పెదపులిపాకలో అనుమతిలేని లేఅవుట్లను, అనధికారికంగా నిర్మించిన 7 భవన నిర్మాణాలను తొలగించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన యజమానులు, రియల్టర్లకు ముందుగానే నోటీసులు జారీ చేసిన అధికారులు పెదపులిపాకలో జీ ప్లస్ 2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకుని అదనంగా ఫ్లోర్లను నిర్మిస్తున్న 2 భవనాలకు వేసిన పిల్లర్లను, ఎలాంటి అనుమతి లేని మరో 5 బేస్‌మెంట్ లెవల్ నిర్మాణాలను తొలగించారు. యనమలకుదురులో జీ ప్లస్ టూ కు అనుమతి తీసుకుని 3 భవనాల్లో అదనంగా మరో ఫ్లోర్ నిర్మాణానికి వేసిన పిల్లర్లను, 2 భవనాల్లో వేసిన అదనపు గదులను నిర్మాణాలను తొలగించారు. రాజధాని రీజియన్‌లో ఎటువంటి అనధికార నిర్మాణాలను అనుమతించేది లేదని, భవన యజమానులు తమ నిర్మాణాలకు ముందుగా తీసుకోవాల్సిన అనుమతులను తప్పనిసరిగా తీసుకుని నిర్మించాలని సీఆర్‌డీఏ డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ కె నాగసుందరి పేర్కొన్నారు. అక్రమ లే అవుట్లు, నిర్మాణాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపిన ఆమె అటువంటి నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌డీఏ జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ గుమ్మడి ప్రసాదరావు, సర్వేయర్లు వెంకటేశ్వర్లు, రుశేఖరరావు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీలేఖ, కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.