విజయవాడ

శిక్షాస్ఫూర్తి ( చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్టూడెంట్స్! మీరంతా బాగా చదివి, దేశం గర్వించదగ్గ మేధావులై దేశానికి మంచిపేరు తేవాలి’.. అంటూ అభిలషించారు తెలుగు మాస్టారు. ‘ఇప్పుడున్న పేరు బాగానే ఉందిగా మాస్టారు! భా-ర-త-దే-శం. ఇంకా ఏం మంచిపేరు తేవాలి?’ ఛలోక్తిగా అన్నాడు ఒక విద్యార్థి.
‘ఒహో! నీకు అలా అర్థమైందా? కూర్చో వెధవా!’ అంటూ గదమాయించారు. ఇంతలో మాస్టారి అనుమతితో లోపలికి వచ్చిన ఒక యువతి మాస్టారికి ఒక ఫొటో ఇచ్చి గుర్తుపట్టమన్నది.
‘కంటి అద్దాలు లేకుండా చెప్పగలనమ్మా. వీడు నా ఓల్డ్ స్టూడెంట్. ఈ రోజున డాక్టర్‌గా నాలుగు చేతులా ఆర్జిస్తూ, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ దేశానికి మంచిపేరు తెస్తున్నాడు. నేనూ తరచూ జనరల్ చెకప్ కోసం వీడి క్లీనిక్‌కి వెళుతుంటాను. అన్నట్లు వీడి పెళ్లికి పిలిస్తే వెళ్లాను. కట్నాలు, లాంఛనాలు, గిఫ్ట్‌లు బాగానే పట్టాడు. వంటలు అదుర్స్. వాళ్లావిడని పరిచయం చేశాడు. కుందనపు బొమ్మలా ఉంది అన్నాను’ గోదావరిలా పొంగిపోతూ అన్నాడు మాస్టారు. ఇవన్నీ కోర్టుకు వచ్చి చెప్పాలని అన్నివిధాలా అనునయంగా మాట్లాడి మాస్టారిని ఒప్పించిందామె.
‘ఇంతకూ నువ్వు ఎవరివమ్మా?’ అడిగారు మాస్టారు.
‘అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు వేధిస్తున్నారని న్యాయం జరిపించమని పోరాటం చేస్తున్న ఆ కుందనపు బొమ్మను.. నేనే మాస్టారూ’ అని భోరుమన్నది. మాస్టారు కంటి అద్దాలు పెట్టుకుని ఆ యువతిని చూసి ఉలిక్కిపడ్డారు. సాక్షులను విచారించిన పిదప న్యాయస్థానం ఆ డాక్టర్‌కి జైలుశిక్ష, జరిమానాతో పాటు అతని వైద్య పట్టా రద్దు చేసి ఇంకెక్కడా వైద్యం చేయకుండా జీవితకాల నిషేధం విధించింది. భవిష్యత్తులో వరకట్న దాహార్తులు ఎంతవారలైనా, ఏ రంగంలో ఉన్నా ఈ శిక్ష స్ఫూర్తినిస్తుందని సందేశం అందించింది.
- డి వెంకట్రావు, ఉయ్యూరు, కృష్ణా జిల్లా.