విజయవాడ

హోదా పోరాటంలో చంద్రబాబు కలసిరావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 22: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పోరాటంలో కలసిరావాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. హోదా ఉద్యమంలో భాగంగా గురువారం చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ఉద్యమకారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి హోదా, విభజన హామీల అమలుకు ఏఐసీసీ కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ప్లీనరీలో కూడా ఈవిషయంపై తీర్మానం చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ చేసే పోరాటంలో కలసిరావాలని హితవు పలికారు. హోదాపై గల్లీ నుంచి ఢీల్లీ వరకూ ఉద్యమించేది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని, భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రఘువీరారెడ్డి వివరించారు.

విమానాశ్రయానికి ప్రధానమైన లింక్ రోడ్డు అభివృద్ధి చేయాలి
* ఎమ్మెల్యే బోడే ప్రసాద్
పెనమలూరు, మార్చి 22: కృష్ణానది కరకట్టను ఆనుకుని అవనిగడ్డ, చల్లపల్లి, నాగాయలంక, మొవ్వ, తదితర ప్రాంతాల వారే కాకుండా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల వారు కూడా మద్దూరు, ఈడ్పుగల్లు మీదుగా గన్నవరం విమానాశ్రయాన్ని సులభంగా చేరుకునేందుకు ఉన్న ప్రధాన లింక్ రోడ్డును సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కోరారు. ఈమేరకు విషయాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ సమావేశంలో గురువారం ఉదయం ఆయన మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయానికి ఉన్న ప్రధాన లింక్ రోడ్డు అభివృద్ధి పనులు గత కృష్ణా పుష్కరాల సమయంలో అసంపూర్తిగా వదిలేశారని తెలిపారు. దీనివల్ల నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వారితో పాటు విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారు ఎన్నో వ్యయప్రయాసలకు లోనవుతున్నారన్నారు. ఈ రోడ్డుకు నిధులు కేటాయించి, త్వరితగతిన అభివృద్ధి చేయవలసిందిగా ఎమ్మెల్యే అభ్యర్థించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మంత్రి దేవినేని ఉమా దీనిపై త్వరలో చర్యలు తీసుకుంటామని సభాముఖంగా హామీ ఇచ్చారు.