విజయవాడ

భూధార్‌తో రిజిస్ట్రేషన్లు సులభతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: భూ వివాదాలకు భూధార్‌తో పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భూధార్ అమలు విధానంపై జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ-2 పీ బాబూరావుతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో భూ వివాదాలకు తావులేకుండా భూధార్ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. మనిషికి ఆధార్ నెంబర్‌లా భూమికి భూధా ర్ సంఖ్య ఉంటుందన్నారు. తద్వారా భవిష్యత్‌లో భూములకు సంబంధించిన సమస్యలు ఉండవని, ప్రజలకు సమగ్ర భూ సేవలు వేగవంతంగా ల భ్యమవుతాయన్నారు. భూ సంస్కరణల్లో ఇది రెండో విప్లవంగా ఆయన అభివర్ణించారు. ఆధార్ నెంబర్‌కు 12 సంఖ్యలు ఉంటే భూధార్‌కు 11 సం ఖ్యలు ఉంటాయన్నారు. భూధార్‌లో తొలి 28 నెంబర్‌తో ప్రారంభమయ్యే వాటికి శాశ్వత భూములుగా, 99 నెంబర్‌తో ప్రారంభమైతే తాత్కాలిక భూములుగా, 00 నెంబర్‌తో ప్రభుత్వ భూములకు చెందినవిగా గుర్తిస్తామన్నారు. కృష్ణా జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రవేశపెడుతున్న భూధార్‌ను మే మాసాంతానికి జిల్లా వ్యాప్తంగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 26-29 తేదీల మధ్య ముఖ్యమంత్రి రాష్టవ్య్రాప్తంగా దీన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. దీనిపై తహశీల్దార్లు, సర్వేయర్లకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే జగ్గయ్యపేట మండలంలో 24 గ్రామాలు, ఉయ్యూరు మున్సిపాల్టీలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్, వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానం అవుతుందని, తద్వారా రిజిస్ట్రేషన్లు సులభతరం అవుతాయన్నారు. భూధార్ విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారి కృష్ణా జిల్లాలో ప్రారంభిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు.