విజయవాడ

సుందర నగరంగా బెజవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: ముఖ్యమంత్రి హామీలకు అనుగుణంగా విజయవాడ నగరాన్ని సుందర తీర్చిదిద్దాడానికి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ బి లక్ష్మీకాంతం పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె.నివాస్, ఎడీసీ జాతీయ రహదారులు ఆర్‌టీసీఆర్ అండ్ బీ పంచాయతీ శాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి హామీల అమలుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బస్సు పర్యాటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి విజయవాడ నగర పర్యటన సందర్భంగా నగరాభివృద్ధి విషయమై ఇచ్చిన ఆదేశాలతో సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నగరంలో ప్రవహిస్తున్న మూడు ప్రధాన కాలువ గట్ల సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా రామవరప్పాడు రింగురోడ్డు వద్ద ప్రత్యేక దృష్టి సారించి ఫౌంటెన్‌తో పాటు సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాన్ని చక్కటి పారిశుద్ధ్యం ఉండే విధంగా నగరపాలక సంస్థ పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా నిర్వహణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రామవరప్పాడు రింగురోడ్డు వద్ద డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రామవరప్పాడు నుండి ఎనికేపాడు వరకు 15 రోజుల్లో గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆశించిన స్థాయిలో పచ్చదనం పెంచే విధంగా అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పూర్తి చేస్తుందన్నారు. అదే తరహాలో ఇంద్రకీలాద్రిపై ఎడీసీ సంస్థ మొక్కలు నాటే సుందరీకరణ పనులను చేస్తుందన్నారు.
విజయవాడ నగర పాలకసంస్థలో విలీనం కావల్సిన గ్రామ పంచాయతీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడ పోస్టర్లు లేకుండా నగరపాలక సంస్థ అధికారులు పర్యవేక్షించాలన్నారు. కుక్కల, కోతుల బెడద లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పిల్లలపై కుక్కల దాడి సంఘటనలు ఏమైన నమోదైతే సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులను బాధ్యులను చేయడం జరుగుతుందన్నారు. స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు నగరంలో ఇప్పటికి 91 కిలోమీటర్ల మేరకు పూర్తయ్యాయని ఎల్‌అండ్‌టీ అధికారులు తెలపగా ఇంకా చేపట్టాల్సిన పనులను రోజుకు ఒకటిన్నర కిలో మీటర్ చొప్పన పనులు చేపట్టి డిసెంబర్ 31నాటికి పూర్తి చేయాలని ఎల్‌అండ్‌టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా సంబంధిత శాఖాధికారులు ముఖ్యమంత్రి హామీల పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తొలుత కలెక్టర్, కమిషనర్ జె నివాస్, ఇతర అధికారులతో కలసి బస్సులో బయలుదేరి రామవరప్పాడు రింగ్, ఆటోనగర్, బల్లెంవారివీధి రోడ్డు, గన్నవరం ఎయిర్‌పోర్టు జాతీయ రహదారి, దుర్గా ప్లైఓవర్ పనులు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యం రథాన్ని సందర్శించిన కలెక్టర్
యువతలో నైపుణ్యాభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులతో కలిసి సందర్శించారు. ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలలో నైపుణ్యం రథం అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక నెల రోజుల పాటు జిల్లా మొత్తం ఈ రథంలో పర్యటించి విద్యార్థులు, యువతలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా దోహదపడుతుందన్నారు. నిష్ణాతులైన సాంకేతిక సిబ్బందితో పాటు వృతి నైపుణ్యం ఉన్న సిబ్బంది ఈ రథంతో పాటు ఉండి అవగాహన సదస్సులు కల్పిస్తారన్నారు. ముఖ్యంగా దత్తత గ్రామాలైన పెదపారుపూడి, ఆత్కూరు, నిమ్మకూరు లాంటి దత్తత గ్రామాల్లో పర్యటించే విధంగా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తగు సూచనలు చేశారు.
రైవస్ కాలువ ద్వారా డెల్టాకు మంచినీరు విడుదల
బస్సు యాత్రలో భాగంగా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం రైవస్ కాలువ లాకుల వద్ద డెల్టా మండలాలకు మంచినీరు విడుదల చేశారు. మంచినీరు అవసరాల కోసం కృత్తివెన్ను, కలిదిండి, కైకలూరు తదితర డెల్టా లాంటి చివరి గ్రామాల మంచినీటి చెరువులకు నీరు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నీటిని కేవలం మంచినీటికే వినియోగించే విధంగా సంబంధిత అధికారులు పర్యవేక్షించి వేసవిలో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులకు ఆదేశించారు.