విజయవాడ

ముగియనున్న బీపీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 24: ఈ నెలాఖరుతో ముగియనున్న బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్‌ను పెండింగ్ దరఖాస్తులంతా సద్వినియోగం చేసుకోవాలని వీఎంసీ సిటీ ప్లానర్ లక్ష్మణరావు సూచించారు. బీపీఎస్ ద్వారా అనధికార భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంపై నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. ఈ నెల 31లోగా దరఖాస్తులను పరిష్కరించుకోకపోతే తరువాత తీసుకునే చర్యల్లో భాగంగా అపరాధ రుసుము విధించడంతో పాటు అనధికార నిర్మాణంగా పరిగిణించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బీపీఎస్‌లో నగర వ్యాప్తంగా 6935 దరఖాస్తులు రాగా వీటిలో 6056 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. మిగిలిన 879లో 39 దరఖాస్తులను తిరస్కరించగా 840 దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయన్నారు. ఈ దరఖాస్తుదారులంతా సకాలంలో స్పందించి తమ భవనాలను క్రమబద్ధీకరించుకోవాలని లక్ష్మణరావు సూచించారు.