విజయవాడ

ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 24: ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక యాప్‌ని ఏర్పాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ పీవీ రామారావు తెలిపారు. ఆర్టీసీ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ ప్రాధాన్యత వారోత్సవాలు ఈ నెల 24 నుంచి 30 వరకు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు సేవలందించాలనే కృతనిశ్చయంతో ప్రయాణికుల చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ద్వారా వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి, ఏ సమయంలో వెళ్లాలి, వారికి కావాల్సిన బస్సుల్లో ఏది ఎంచుకుంటున్నారు, అందులో ఉన్న చార్జీలు ఎంతనే పలు అంశాలు తెలుసుకునేలా యాప్‌ని రూపొందించామన్నారు. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఆర్టీసీ సేవలను వినియోగించుకోవచ్చని రామారావు తెలిపారు. అయితే స్మార్ట్ ఫోన్‌లో ఈ-వాలెట్ ద్వారా ప్రయాణికులు రిజర్వ్ చేసుకున్న సీట్‌ని తమ ఫోన్‌లో ఉన్న యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని నగదు చెల్లించవచ్చన్నారు. ఒకవేళ ప్రయాణం రద్దు చేసుకున్న పరిస్థితిలో అదే యాప్ ద్వారా సమాచారం తెలియజేస్తూ టికెట్ రద్దు చేసుకుంటే వారి అకౌంట్‌లోకి తిరిగి సొమ్ము జమయిపోతుందన్నారు. అలాగే ప్రయాణిస్తున్న బస్సు ఏ ప్రాంతంలో ఉంది, తాము ఏ ప్రదేశంలో ఉన్నారనే సమాచారం సైతం తమ బంధువులకు ఇచ్చేలా ఈ యాప్ సమాచారం అందిస్తుందన్నారు. ఈ-వాలెట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు చార్జీల్లో 5శాతం నగదు తిరిగి తమ అకౌంట్‌లోకి చేరిపోతుందని రామారావు వివరించారు. విలేఖర్ల సమావేశంలో చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కే నాగేంద్రబాబు, డిప్యూటీ సీటీఎం ఏ జాన్సీకుమార్, కే శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.