విజయవాడ

కొండ ప్రాంతవాసుల దాహార్తి తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మార్చి 24: వేసవి కాలం తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న కొండ ప్రాంతవాసుల దాహార్తి తీర్చాలంటూ వీఎంసీ ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్‌పర్సన్ నాగోతి నాగమణి మున్సిపల్ కమిషనర్ జె నివాస్‌కి శనివారం ఉయదం వినతిపత్రం అందజేశారు. పాతబస్తీలోని 30, 31, 32 డివిజన్లలో వేలాది కుటుంబాలు కొండ ప్రాంతాల్లో వందలాది మెట్లు దూరంలో ఉన్నారు. వారి తాగునీటి అవసరాలకు తగిన విధంగా డివిజన్లలో కొండ ప్రాంతాల్లోనే వాటర్ ట్యాంక్‌లు నిర్మించారు. బూస్టర్ పంపుల ద్వారా ఆ ట్యాంకుల్లో నీటిని నింపి ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. అయితే పంప్ సమయంలో సాంకేతిక లోపాల వల్ల నీటి సరఫరాకి అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి ఇబ్బందుల వల్ల వచ్చే వేసవిలో ఇంకా నీటి ఎద్దడిని కొండ ప్రాంతవాసులు ఎదుర్కొనాల్సి వస్తోంది. శాశ్వత పరిష్కార మార్గంగా తాగునీటి ఎద్దడిని నివారించాలని నాగమణి వినతిపత్రంలో కోరారు. దివంగత మాజీ మంత్రి ఎంకే బేగ్ చొరవతో నాడు సింగ్‌నగర్ వాసుల తాగునీటి అవసరాలకు పెద్ద సిమెంట్ పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 27 సంవత్సరాల నుండి ఆ ప్రాంతవాసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నేడు 30, 31, 32 డివిజన్‌లలో కొండ ప్రాంతవాసుల కోసం నాలుగు అంగుళాల పైప్‌లను సింగ్‌నగర్ పైపులైన్‌కి అనుసంధానం చేయడం ద్వారా మూడు డివిజన్లలో వాటర్ ట్యాంకులు నింపవచ్చని, తద్వారా రానున్న రెండు నెలల్లో కొండ ప్రాంతవాసుల తాగునీటి ఎద్దడిని నివారించవచ్చని ఆమె వినతిపత్రంలో వివరించారు.