క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఏప్రిల్ 7: రోడ్డు దాటు తూ డివైడర్ తగిలి ముందుకు పడిన వృద్ధుడి పైనుండి ఆటో దూసుకుపోవటంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృ తి చెందాడు. శనివారం సాయంత్రం కొత్తపేట పోలీసు స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. గొ ల్లపాలెంగట్టు వాటర్ ట్యాంక్ సందు లో నివాసమంటున్న షేక్ ఖాశిం(60) శుభకార్యాలకు బాజాభజంత్రీలు వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం బాజాలు కావాలని ఓ వ్యక్తి ఫోన్ చేయగా మాట్లాడానికి బయటకు వెళ్లాడు. తిరిగి షేర్ ఆటోలో వచ్చి లాలిమ బార్ వద్ద ఆటో దిగాడు. రోడ్డుకు పడమర వైపున దిగిన ఖాశీం ఇంటికి వెళదామని రోడ్డు దాటుతున్నాడు. సుమారు అడుగున్నర ఎత్తున్న డివైజర్ దాటుతూ తూలి ముందుకు పడ్డాడు. చిట్టినగర్ సెంటర్ నుండి కొత్తపేట వైపుకు వెళుతున్న ఆటో క్షణాల్లో అతనిపై ఎక్కేసింది. ఆటోడ్రైవర్ అప్రమత్తమై ఆకస్మికంగా బ్రేకులు వేశాడు. ఆటో వెనుక వేగంగా వస్తున్న మినీ వ్యాన్ ముందున్న ఆటోని బలంగా ఢీకొంది. మినీ వ్యాన్‌ని వెనుక వచ్చిన మరో ఆటో బలంగా ఢీకొంది. ఇలా మూడు వాహనాలు ఢీకొన్న ఊపులో ఖాశిం పైనుండి ముందు ఆటో దూసుకెళ్లడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకున్న ఆటోడ్రైవర్ కట్టా వెంకటకృష్ణకి గాయాలు కావటంతో 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొత్తపేట పోలీసులు ఖాశిం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య హుస్సేనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.