విజయవాడ

రఘువీరారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 6: కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాజెక్టుపై పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో కేశినేని భవన్ వద్ద శుక్రవారం రఘువీరారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) తన పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుండే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవాడ నగర ప్రజల చిరకాల వాంఛ అయిన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి మూడు రకాల డిజైన్లు రూపొందించి వివిధ రంగాల నిపుణులు మరియు నేషనల్ హైవే అధారిటీ వారి నిర్ణయానుసారం ఉత్తమమైన డిజైన్‌ను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరి సహకారంతో రూ.462 కోట్లు నిధులు కేటాయింపచేసి నితిన్ గడ్కరి, నారా చంద్రబాబు నాయుడుల సమక్షంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టడమైందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ శంకుస్థాపన రోజున విజయవాడ నగర ప్రజలు ఒక వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజల ఇబ్బందులను ఏ మాత్రం లెక్కచేయకుండా అసలు ఫ్లైఓవర్ నిర్మాణమే అవసరం లేదని ధర్నాలు చేసిన విషయం మరచి నేడు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాజెక్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. అర్బన్ అనుబంధ సంఘాల ఇన్‌ఛార్జి కొమ్మారెడ్డి పట్ట్భారామ్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) ఫైఓవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక సవాలుగా స్వీకరించి కాలినడకన అనేక సార్లు ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాన్ని మొత్తం అణువణువు పరిశీలించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనలు తీసుకుంటూ ఉత్తమమైన డిజైన్ రూపొందించి పలుమార్లు స్వయంగా సంబంధిత ఫైళ్లను మోసుకుంటూ అనేక కార్యాలయాలు తిరిగి ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి శ్రీకారం చుట్టారని, విజయవాడ పార్లమెంట్ చరిత్రలో మరే ఇతర పార్లమెంట్ సభ్యుడు చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలందరి మన్ననలు అందుకుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో అర్బన్ పార్టీ ప్రథమ ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతురావు, మైనార్టీ సెల్ నాయకులు ఎండి ఇర్ఫాన్, మహిళా అధ్యక్షురాలు కోడెల సూర్యలత, ఎస్టీ సెల్ అధ్యక్షులు తాజనోత్ శంకర్ నాయక్, కో-ఆప్షన్ సభ్యులు చెన్నుపాటి ఉషారాణి, ప్రధాన కార్యదర్శి మనుపాటి కిషోర్, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు పరిశపోగు రాజేష్ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.