విజయవాడ

భద్రత వలయంలో సీఎం ధర్మపోరాట దీక్షా శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో శుక్రవారం తలపెట్టనున్న ధర్మ పోరాట దీక్షా శిబిరం పూర్తిగా భద్రతావలయంలో కొనసాగనుంది. ఉదయం 7 గంటలకు సీఎం దీక్షలో కూర్చుంటారు. సాయంత్రం 7 గంటల వరకు కొనసాగే ఈ దీక్షకు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ప్రత్యేకంగా గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని దీక్షా శిబిరాన్ని పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్టేడియం చుట్టుపక్కల జరుగుతున్న భద్రతా ఏర్పాట్లు పరిశీలించి, పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశారు. రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి దీక్షకు ఉపక్రమించడం ఇదే ప్రథమం. సుమారు 50వేల మంది నుంచి లక్ష మంది వరకు ఆయనకు సంఘీభావంగా రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జనం తరలిరానున్నారు. అదేవిధంగా 70 సంఘాలకు చెందిన ప్రతినిధులు మద్దతుగా దీక్షలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రత కట్టుదిట్టం చేయడంతోపాటు నిఘా వర్గాలు క్షణ క్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీక్షను పుర్కసరించుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. వీరందరికీ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో సమావేశం నిర్వహించి సీపీ ఆదేశాలతో ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతి భద్రతల పరిరక్షణ కట్టుదిట్టం చేయాలని, ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడకుండా, ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. బందోబస్తు విధులకు హాజరయ్యే సిబ్బంది ప్రజల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని, క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి దిశానిర్దేశం చేసిన వారిలో జాయింట్ పోలీసు కమిషనర్ క్రాంతి రాణా తాతా, డీసీపీ గజరావు భూపాల్, ట్రాఫిక్ అదనపు డీసీపీ, ఏసీపీలు పాల్గొన్నారు.
* ట్రాఫిక్ మళ్లింపు
ఇదిలా ఉండగా దీక్ష సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పోలీసుశాఖ ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపట్టింది. తరలివచ్చే వేలాది వాహనాలకు స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. అయితే ఇతర జిల్లాల నుంచి నగరం మీదుగా వెళ్లే భారీ వాహనాలపై మాత్రం ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు, లారీలు 20న తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మళ్లించారు. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే వాహనాలు హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, అదేవిధంగా విసన్నపేట, కల్లూరు, వైరా, ఖమ్మం, అదేవిధంగా దేవరపల్లి, సత్తుపల్లి, తల్లాడ, ఖమ్మం, సూర్యాపేట మీదుగా మళ్లించారు. విశాఖ-చెన్నై మధ్య రాకపోకలు సాగించే వాహనాలు ఒంగోలు, త్రోవగుంట, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, జంక్షన్ అదేవిధంగా హైదరాబాద్-చెన్నై మధ్య రాకపోకలు సాగించే వాహనాలు నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాల గూడ, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల, ఒంగోలు మీదుగా మళ్లించారు.
* పార్కింగ్ ప్రదేశాలు
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు వచ్చే వాహనాలు ఆర్‌టీఏ జంక్షన్ నుంచి రెడ్ సర్కిల్ మధ్య వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. దీక్షకు వచ్చే వారు స్టేడియం వెస్ట్ గేటు నుంచి లోనికి ప్రవేశించాలి. రెడ్ సర్కిల్, శిఖామణి సెంటర్, మధు చౌక్, మధర్‌ధెరిస్సా బొమ్మ, సిద్దార్ధ పబ్లిక్ స్కూలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల, లయోలా కళాశాల తదితర చోట్ల వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గుంటూరు నుంచి వచ్చే వాహనాలు నేతాజీ వంతెన, పశువుల ఆస్పత్రి, ఆర్టీఏ జంక్షన్ వద్ద వాహనాలు నిలుపుకోవాలి. ఈ మేరకు నగర పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. ప్రజలు, వాహన చోదకులు సహకరించాలని అధికారులు విఙ్ఞప్తి చేశారు.