విజయవాడ

బాలకృష్ణకు బుద్ది చెబుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: ప్రధాని మోదీని కించపరుస్తూ పరుష పదజాలంతో దూషించిన బాలకృష్ణకు బుద్ధి చెబుతామని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యమూర్తి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ధర్మ దీక్ష కార్యక్రమం సందర్భంగా ఆయన వియ్యంకుడు బాలకృష్ణ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి మాట్లాడిన తీరు అసభ్యకరంగా ఉందన్నారు. ప్రధాని మోదీని విమర్శించే అర్హత బాలకృష్ణకు లేదన్నారు. ఈ మాటలను సభ్య సమాజం అంగీకరించదన్నారు. భార్యను వదిలేశారని ప్రధానిని వ్యక్తిగతంగా విమర్శించడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేశారు. మహిళల పట్ల బాలకృష్ణకు ఎలాంటి గౌరవం లేదని దీన్నిబట్టి తెలుస్తోందన్నారు. అలాగే కొజ్జా, శిఖండి, నమ్మక్ హరాం అంటూ వ్యాఖ్యానించిన బాలకృష్ణది నోరేనా? అని విమర్శించారు. ఆయన నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. బాలకృష్ణపై కొట్టివేసిన అటెంప్ట్ టు మర్డర్ కేసులు తిరగదోడితే ఆయన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బాలకృష్ణ మాట్లాడిన తీరును చూస్తుంటే బాలకృష్ణకు మతిభ్రమించిందనే అనుమానం వస్తుందన్నారు. చంద్రబాబు అమరావతిలో ఒక పిచ్చాసుపత్రి, ఒక జైలు నిర్మించాలని సూచించారు. మతిభ్రమించిన బాలకృష్ణ ఉండాల్సింది ఆ పిచ్చాసుపత్రిలోనే అన్నారు. వెనుకబడిన తరగతికి చెందిన మోదీ ప్రధాని పదవిలో ఉండటం సహించలేని తెలుగుదేశం నాయకులు నోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. తెలుగుదేశం వల్ల బీజేపీ గెలువలేదని, బీజేపీ వల్లే తెలుగుదేశం గెలిచిందన్నారు. 2004లో పొత్తు లేకుండానే 4 సీట్లు గెలిచామన్నారు. రాజధానిని ఒకరోజులో నిర్మించలేమని రేపటికల్లా ఏమీ కాదన్నారు. మీ చేతకానితనానికి బీజేపీపై నిందలు వేయడం సరికాదని చంద్రబాబును హెచ్చరించారు. బాలకృష్ణ నోటిని అదుపులో పెట్టుకునేలా చంద్రబాబు సరిదిద్దాలని సూచించారు. తండ్రిని మోసం చేసిన చంద్రబాబుతో వియ్యమందిన బాలకృష్ణ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. పండిత పుత్ర పరమశుంఠగా బాలకృష్ణను మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అభివర్ణించారు. రాజకీయ విలువలు లేకుండా నిరంతరం మద్యం సేవించి బావ మత్తులో ఉన్న బాలకృష్ణ అగ్రకుల అహంకారంతో బీసీ వర్గానికి చెందిన ప్రధాని మోదీని దూషించడాన్ని కార్యకర్తలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఘనంగా శంకర జయంతి
ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 20: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం ఉదయం శ్రీ ఆదిశంకరాచార్యులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 9గంటల నుండే స్వామికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, ప్రదాన అర్చకుడు లింగంబొట్ల దుర్గా ప్రసాద్, పర్యవేక్షకుడు శ్రీనివాసమూర్తి, తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈసందర్భంగా భక్తులకు ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు.
శివాలయంలో..
పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో శుక్రవారం ఉదయం ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ ఆధ్వర్యంలో ఘనంగా శంకర జయంతి నిర్వహించారు. పురోహితులు రాచకకొండ నాగరాజుశర్మ, రాఘవేంద్రశర్మ, తదితరులు తొలుత శంకరచార్యులు విగ్రహం ముందు దేవస్థానం ఈవో కేవీఎన్‌డీకే ప్రసాద్ దంపతులు కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ, కలశస్థాపన వంటి పూజలను నిర్వహించారు. తర్వాత శంకరచార్యులకు అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు సీనియర్ అర్చకులు అంజనేయలు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా సిబ్బంది అప్పారావు, శ్రీను, శివ భక్తులకు వడప ప్పు, పానకం, మామిడి కాయలు ఉచితంగా పంపిణీ చేశారు. ఇదేవిధంగా ప్రకాశం బ్యారేజీ కూడలి ఎదుట ఉన్న శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానంలో శంకర జయంతిని ఆలయ పర్యవేక్షకుడు శేషు ఆధ్వర్యంలో ఘనంగా ని ర్వహించారు. అర్చకులు స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు ని ర్వహించారు. నగరానికి చెందిన పలువురు భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వేర్వేరు సమయాల్లో మాజీ ధర్మకర్తలు పొట్నూరి దుర్గా ప్రసాద్, అడ్డూరి లక్ష్మణరావు, తదితరులు స్వామిని దర్శించుకున్నన్నారు.

ధర్మపోరాట దీక్షతో జంక్షన్‌ను ముంచెత్తిన ట్రాఫిక్
హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 20:విభజన ఆంధ్రప్రధేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన హామీలను నేరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో చేపట్టిన ధర్మపోరాట దీక్షతో హనుమాన్‌జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా మారింది. దీంతో చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై జంక్షన్ కూడలి నుంచి ఏలూరు వైపు వాహనాలు బారులుతీరాయి. ఉదయం నుంచి వాహనాల మళ్లింపు చేయాలని అధికారులు నిర్ణయించిన అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో విఫలం కావడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు వైపునుంచి గుంటూరు, ఒంగోలు, చెన్నై వెళ్ళే వాహనాలను జంక్షన్ కూడలి నుంచి గుడివాడ, పామర్రు, అవగనిగడ్డ మీదుగా మళ్లించారు. ఏలూరు వైపు నుంచి జగ్గయ్యపేట, హైదరాబాద్ వెళ్లే వాహనాలు నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా తరలించారు. వాహనదారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంతో జంక్షన్ కూడలి వద్ద పోలీస్ సిబ్బంది చెబుతున్నా డ్రైవర్లు వినకపోవడంతో వాహనాల మళ్ళింపు ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ క్రమంలోనే జాతీయ రహదారిపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. అధిక ఎండతీవ్రతకు వాహనాలలో వున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెళ్లిళ్ల సీజను కావడంతో పెళ్లి బృందాలు ట్రాఫిక్‌లో చిక్కుకొని సమయం దాటిపోతుందనే భయంతో 100కి కాల్స్ చేసినట్లు పోలీస్‌వర్గాలు తెలిపాయి.