విజయవాడ

దద్దరిల్లిన ధర్మపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజానీకం
* సంఘీభావంగా భావోద్వేగ ప్రసంగాలు
* హోదా ఉద్యమానికి మరింత ఊతమిచ్చిన బాబు దీక్ష
బెంజిసర్కిల్, ఏప్రిల్ 20: విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలోని అన్ని హామీలను తప్పకుండా నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒక రోజు ధర్మపోరాట దీక్షతో నగరం ఒక్కసారిగా దద్దరిల్లింది. వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజానీకం, మీతో మేమున్నామన్న పార్టీ శ్రేణులు, హోదా కోసం ఎంతవరకైనా వెళ్తామన్న పలు పార్టీలు, సంఘాల హోదా నినాదాలతో పాటు, వచ్చిన వారి సంఘీభావంగా భావోద్వేగ ప్రసంగాలు చేయడంతో హోదా ఉద్యమానికి మరింత ఊతమిచ్చేలా చంద్రబాబు దీక్ష సాగింది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో శుక్రవారం కాస్త ఆలస్యంగా ప్రారంభమైన సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష 12 గంటల పాటు సాగింది. ఉదయం నిర్దేశించిన సమయానికి మా తెలుగు తల్లి గీతాలాపనతో సీఎం దీక్ష ప్రారంభమైయ్యింది. ప్రముఖుల చిత్రపటాలకు పూలదండలు వేసిన సీఎం చంద్రబాబు వారికి ఘన నివాళులర్పించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణ చంద్రబాబుకు నూలుపోగు దండ వేసి దీక్షను ప్రారంభింజేశారు. టీటీడీ వేదపండితులు ఆశీర్వచనంతో పాటు సభా వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. సీఎంకు దుర్గగుడి పురోహితులు ఆశీర్వచనాలు అందించారు. 68ఏళ్ల వయస్సులో పుట్టిన రోజు నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం దీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు, రాష్ట్ర నలుమూలలతో పాటు పలు రాష్ట్రాలు, దేశ విదేశాల నుండి వచ్చారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ దీక్షకు మద్దతుగా తరలి వచ్చారు. ప్రముఖ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు, రాష్ట్ర సమతాపార్టీ అధ్యక్షుడు ఎస్వీ కృష్ణారావు, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు శంకరావు, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు రంగసాయి, ఎన్‌జీఓ సంఘం నేత ఆశోక్‌బాబు, అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వరావు, ఎలీస్ సంస్థ చైర్ పర్సన్ రామాదేవి, ఆర్‌ఎస్‌పీ నాయకులు జానకీరాం, ఏపీ ఆప్ పార్టీ ప్రతినిధి కే వీరప్రసాద్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి శివనాగేశ్వరరావు, నవసమాజం పార్టీ ప్రతినిధి చంద్రవౌళి, ఆల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ ప్రతినిధి టీవీ సుందరరామరాజు, ఇండియన్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మోటూరి కృష్ణప్రసాద్, కూచిపూడి నాట్యారమం చైర్మన్ కూచిబట్ల ఆనంద్, ప్రవాసాంధ్రులు కేసీ చౌదరి, జైకుమార్, చెస్ క్రీడాకారిణీ కోనేరు హంపి, టీవీ ఆర్టిస్ట్ అసోసియేష్‌న్ ప్రతినిధులు, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, గల్లా జయదేవ్, పలువురు శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ మహిళా ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దినేష్ కుమార్, సామాజిక కార్యకర్త సత్యవాణి, ఏపీడబ్యుజే ప్రతినిధులు నల్లి ధర్మారావు, ఏపీజేఎఫ్ ప్రతినిధులు కృష్ణాంజనేయులు, విశాలాంధ్ర ప్రతినిధి నల్లముల చక్రవర్తి, మేయర్ కోనేరు శ్రీ్ధర్‌తో పాటు పలు సంఘాల ప్రతినిధులు, డప్పు కళాకారులు, వివిధ వృత్తుల సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపి సభలో హోదా కోసం ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దీక్ష సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను ఎంతగానో అలరించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు సభలోని వారిని ఉత్సాహపరిచేందుకు పలు ప్రత్యేక హోదా గీతాలను అలపించారు. వీటితో పాటు పలు సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు. 12 గంటల పాటు సాగిన ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని అలరించేందుకు ఏర్పాటు
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 20: కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఓడిసా రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శిగా నియామకమైన సందర్భంగా శుక్రవారం ఉదయం నగరంలోని ఏఐసీసీ కార్యాలయంలో ఘనంగా సత్కరించిన రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడుగా నియామకమైన తరువాత పార్టీలో యువతీ యువకులకు అధికంగా ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. భారత రాజకీయాలలో పారదర్శకత, నిజాయితీ, నైతిక విలువలను పెంపొందించే దిశగానే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశ యువతకు రాజకీయాలు కూడా ప్రపంచ దేశాలకు అదర్శప్రాయంగా నిలపాలన్న లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా మంచి భవిష్యత్తు ఉంటుందని, కార్యకర్తల స్థాయి నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులే కాకుండా కేంద్ర మంత్రులుగా కూడా అనేక అవకాశాలిచ్చింది కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. రాబోయే 2019 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు ప్రతి కార్యకర్త సైనికుడుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసకుమార్, తదితరులు పాల్గొన్నారు.