విజయవాడ

అభివృద్ధిని చూసి ఓర్వలేని జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి నాలుగేళ్లుగా కేంద్రంతో అనేక విధాలుగా కృషి చేస్తున్నారని, రాష్ట్భ్రావృద్ధి కేవలం చంద్రబాబు వల్లనే సాధ్యపడుతుందని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. హోదా సాధన డిమాండ్‌పై జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆదివారం నగరంలో ఎంజీ రోడ్డులోని బ్యాంక్ ఆవరణలో నిరాహారదీక్ష చేపట్టారు. దీక్ష ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సహకార రంగ ప్రముఖులు పాల్గొని సంఘీభావం తెలిపారు. దీక్షలో పిన్నమనేనితోపాటు బ్యాండ్ డైరెక్టర్లు, సిబ్బంది సైతం పాల్గొన్నారు. దీక్షను ప్రారంభించిన మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత జగన్ 2019 ఎన్నికల్లో అధికారం కోసం తాపత్రయపడుతూ దొంగ యాత్రలు చేస్తున్నాడని, పట్టిసీమ ఫలితంగా పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. మోదీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజల్ని మోసగించి నట్టేట ముంచారన్నారు. చంద్రబాబు కృషి ఫలితంగా రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయని గుర్తు చేశారు. ఎంపీలు కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీలుగా చట్టసభలో రాజీలేని పోరాటం చేస్తున్నామని లోటుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను కేవలం 3వేల కోట్లకు తగ్గించిన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బండారు హనుమంతరావు, టీడీపీ నేత గనే్న ప్రసాద్, ఎన్జీవో నాయకులు గుళ్లపల్లి నారాయణరావు తదితరులు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి ప్రజలంతా తోడ్పడాలని, హోదా కోసం రాజకీయాల కతీతంగా పోరాడాలని, నేడు రాష్ట్రం విడిపోయి ఒట్టి చేతులతో ఉన్నామన్నారు. బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని మాట్లాడుతూ హోదా కోసం పోరాటానికి సహకార రంగం నిరంతరం ముందుందన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బచ్చుల అర్జునుడు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోరుతూ శాంతి హోమం
ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 22: కేంద్రం ఏపీకి వెంటనే ప్రత్యేక హోదాను కేటాయించాలని డిమాండ్ చేస్తూ దుర్గగుడి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శాంతి హోమాన్ని అర్చకులు భక్తితో నిర్వహించారు. మల్లిఖార్జున మహామండపం పక్కనే ఉన్న యాగశాలలో ఆదివారం ఉదయం దేవస్థానం ఆస్థానాచార్యుడు విష్ణుబొట్ల శివ ప్రసాద్, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఋత్వికులు ఈ కార్యక్రమాన్ని భక్తితో నిర్వహించారు. ఋత్వికులు తొలుత గణపతి పూజ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించి తర్వాత ఈశాంతి హోమాన్ని ప్రారంభించారు. ఉదయం 8గంటల నుండి 11-30గంటల వరకు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈశాంతి హోమం పరిసమాప్తం చేశారు. ఈకార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీ్ధర్, శాసన సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తదితరులు హాజరైయ్యారు. వీరికి ఈవో ఎం పద్మ , ట్రస్ట్‌బోర్డు కమిటీ చైర్మన్ వి గౌరంగబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కమిటీ ధర్మకర్తలు గూడపాటి పద్మశేఖర్, వెలగపూడి శంకరబాబు, సూర్యకుమారి, సాంబ సుశీల, పి విజయ్‌శేఖర్, పాప, సిహెచ్ లక్ష్మీ నరసింహారావు, బి రామ్ ప్రసాద్, వి రామనాధం,రాజ, ప్రకాశరావు, దేవస్ధానం సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు.