విజయవాడ

అనుమతి లేని నిర్మాణాలు, అక్రమ లేఅవుట్ల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 25: రాజధాని రీజియన్ పరిధి ప్రాంతా ల్లో నిర్మించే ప్రతి నిర్మాణానికి, లే అవుట్లకు నిబంధనల ప్రకారం అనుమతు లు తీసుకోవాలని, లేనిపక్షంలో వాటిని తొలగిస్తామని సీఆర్‌డీఏ డెవలప్‌మెం ట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఉద యం రీజియన్ పరిధిలో పలు అనధికార, అక్రమ నిర్మాణాలు, లే అవుట్లను తొలగించే కార్యక్రమాలను ముమ్మరం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని, ప్లాన్ల మం జూరులో పారదర్శకంగానే కాకుండా భవన యజమానులకు మెరుగైన సేవలందిస్తున్న సీఆర్‌డీఏ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ అక్రమ నిర్మాణాలను అనుమతించేది లేదని తెలిపిన ఆయన ప్లాన్ నిబంధనలపై విస్తృత అవగాహన క ల్పించిన తర్వాతే ఆయా నిర్మాణాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా యనమలకుదురులో ఒక భవనంలో 4వ అంతస్థు పెంట్ హౌస్ గో డల నిర్మాణాలను నిలిపివేశారు. డొంక రోడ్డులో మరో భవనం బేస్‌మెంట్ పిల్ల ర్ లేవల్‌లోనే పనులను, యనమలకుదురు పప్పుల మిల్లు వద్ద, కానూరు బందరు రోడ్డులో పునాది దశలో ఉన్న రెండు నిర్మాణాల పనులను, తెనాలి జోన్ పరిధిలోని వేజేండ్లలో 3 అనుమ తి లేని నిర్మాణాలను అధికారులు అ డ్డుకున్నారు. పెదపరిమిలో అనుమతి లేకుండా 3.5 ఎకరాల్లో వేసిన లే అవు ట్, ఉండవల్లిలో జీ ప్లస్ టూ అనుమతి తీసుకుని అదనంగా నిర్మించిన 3వ అంతస్తును తొలగించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ గు మ్మడి ప్రసాదరావు, జోనల్ డెప్యూటీ డైరెక్టర్ కె హిమబిందు, జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్లు టి నరేంద్రనాధ్ రెడ్డి, సిహెచ్ మధుసూదనరావు, ఇందుప్రి య, గుమ్మడి ప్రసాదరావు, టీపీవో కామేశ్వరి, ఎడీఎంలు పి మధుసూదనరావు, ఈ శ్రీనివాసరావు, ప్లానింగ్ అసిస్టెంట్లు కృష్ణచంద్, మనోహర్ సర్వేయ ర్ విశ్వనాధ్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు రజిని, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
వీఎంసీ ఆధ్వర్యంలోనూ...
నగర పాలక సంస్థ పరిధిలోని 52, 58వ డివిజన్లలో అక్రమ నిర్మాణాలను వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. టీపీఎస్ శారద నేతృత్వంలో బుధవారం 52వ డివిజన్ అయ్యప్పస్వామి గుడి వెనుక బుడమేరు కరకట్టపై నిర్మిస్తున్న రేకుల షెడ్డును, 58వ డివిజన్‌లోని రాజీవ్‌నగర్‌లో ఎటువంటి ప్లాన్ లేకుండా అనధికారికంగా నిర్మిస్తున్న మూడవ అంతస్థు నిర్మాణ పనులను అక్రమ ఆక్రమణల నిర్మూల దళం సిబ్బంది సహకారంతో తొలగించినట్టు ఆమె పేర్కొన్నారు. వీఎంసీ ప్లాన్ లేకుండా ఎటువంటి నిర్మాణాలను అనుమతించేది లేదని, ప్రతి నిర్మాణానికి విధిగా ప్లాన్ తీసుకోవాలని టీపీఎస్ శారద కోరారు.

ఈ-కృష్ణా కలెక్టర్ యాప్‌కు 5.5 స్టార్ రేటింగ్

విజయవాడ, ఏప్రిల్ 25: ఇటీవల ఆ విష్కరించిన ఈ-కృష్ణా కలెక్టర్ యాప్ కు విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. 3 రోజులుగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చే యడంతో పాటు యాప్ పట్ల సానుకూ ల దృక్పథాన్ని తెలియజేస్తున్నారు. ఈ యాప్ ద్వారా జిల్లా వాసులు తమ స మస్యలను లిఖిత రూపంలోగాని, వా యిస్ రికార్డు రూపేణేగాని, ఫొటో ద్వారాగాని ఫిర్యాదును తమకు వచ్చిన రీతిలో తెలుపుకోవచ్చున్నారు. ఈ నెల 22న ప్రారంభించిన ఈ యాప్ పట్ల వి శేష స్పందన రావడంతో తమ స్పందనను సానుకూల దృక్పథంతో తెలియజేస్తున్నారు. కలెక్టర్ ఆలోచన అద్భుతంగా ఉందని ఈ వెంకటేష్ స్పందించగా, ఒక ముఖ్యమైన యాప్‌గా శరత్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా శివప్రసాద్‌రావు, కే నాగరాజు కలెక్టర్ ఆలోచన విధానాన్ని ప్రసంశించారు. ప్రస్తుతం ఈ-యాప్ 5.5 రేటింగ్‌తో అందరి మన్ననలు పొందుతోంది.