విజయవాడ

మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: దోమలను అరికట్టి మలేరియా వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య మలేరియా విభాగాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నగరంలోని క్యాంపు కార్యాలయం నుండి బుధవారం కలెక్టర్ బీ లక్ష్మీకాంతం మలేరియాపై యుద్ధానికి సంసిద్ధం అంటూ అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో వాంబే కాలనీ, సింగ్‌నగర్ వంటి ప్రాంతాల్లో దోమలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, డ్రైనేజీల్లో నీరు నిలవ ఉండకుండా పూడిక తీయాలన్నారు. మలేరియాపై యుద్ధానికి సంసిద్ధం కావాలని ఆదేశించారు. మలేరియా వ్యాధి ప్రధానంగా దోమకాటు ద్వారా వ్యాప్తిస్తుందని అంటూ ముందుగా దోమలపై దండయాత్ర నిర్వహించాలన్నారు. నీరు, నిలవ ఉండే ప్రాంతాలను గుర్తించి నిర్మూలించాలన్నారు. పాత టైర్లు, కొబ్బరి బొండాల్లో నీరు నిలవ ఉండి దోమలు పునరుత్పత్తి ప్రధాన కేంద్రాలుగా ఉంటాయని వీటిని తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వారంలో ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా నీరు నిలవ ప్రాంతాలను గుర్తించి నిర్మూలించాలన్నారు. ప్రజలు దోమల బారినపడకుండా దోమ తెరలు వాడేలా అవగాహన కల్పించాలన్నారు. నీటి నిల్వ ప్రాంతాలు, డ్రైన్స్‌ల్లో దోమల మందు పిచికారీ చేయాలన్నారు. అనుమానిత పీడితుల నుండి రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక చికిత్స నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అవగాహన ర్యాలీలో వైద్య ఆరోగ్యా అధికారి డాక్టర్ టీ పద్మజారాణి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఆదినారాయణ, అదనపు వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ టీవీఎస్ శాస్ర్తీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.