విజయవాడ

టీడీపీ వచ్చాకే బీసీలకు స్వాతంత్య్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 25: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే బీసీలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన కలిసి ఎన్ని కుట్రలు చేసినా బలహీనవర్గాలను టీడీపీ నుంచి వేరు చేయలేరన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు గుర్తింపు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. ముఖ్యమంత్రి బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని, అనేక మంది ఉన్నత పదవులు పొందారని, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు అయ్యారని, ఎనిమిది మంది మంత్రులు బిసిలుగా ఉన్నారన్నారు. పదేళ్ల పాలనలో ఎక్కడన్నా బీసీలకు గుర్తింపు ఇచ్చారా అని విపక్షాలను ప్రశ్నించారు. ఈశ్వరయ్యను పావుగా వాడుకుంటున్నారని, జడ్జీలను నియమించే పదవుల్లో ఉండి ఆనాడు బీసీలను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. పీకే, జగన్ కలిసి ఈశ్వరయ్యను పావుగా వాడుకుంటున్నారని, ఆయన పదవిలో ఉండగా బీసీలకు న్యాయం చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణాకు చెందిన ఈశ్వరయ్య అక్కడ బీసీలకు కూడా న్యాయం చేయలేని స్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అప్పట్లో వైఎస్సార్ హయాంలో చేనేత కార్మికులను ఎందరినో పొట్టన పెట్టుకున్నారని, తెలుగుదేశం వచ్చాకే బీసీలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతిపక్షపార్టీలవి అవకాశవాద రాజకీయాలు : బచ్చుల
ప్రతిపక్ష పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారానికి ఒకసారి కోర్టుకు వెళ్లి వచ్చేవారిని ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రనుద్దేశించి విమర్శిస్తూ రూ.300ల బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారని ఆరోపించారు. ఆదర్శ రాజకీయాలంటే తండ్రి చనిపోయాక ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించడం కాదని, ప్రజలు ప్రతిపక్ష నేతగా సరిపెడితే నమ్మకం లేని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వచ్చారని అన్నారు. వైసీపీని బీజేపీకి తాకట్టు పెట్టిన ఘనడు జగన్ అని ధ్వజమెత్తారు. డ్వాక్రా గ్రూపులు పెట్టింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. పట్టిసీమ దండగ అన్న జగన్‌ను నేడు రైతులు ఛీ కొట్టే పరిస్థితి నెలకొందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 155 స్థానాలు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతిపక్ష నేతగా ఒక్క శాతం కూడా న్యాయం చేయని జగన్ పగటి కలలు కలగానే మిగిలిపోతాయని, ఇక పొత్తు పెట్టుకునే బీజేపీ కూడా మట్టి కొట్టుకుపోతుందని, ఇకనైనా కళ్లు తెరిచి నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు.

20 శాతం పూర్తయిన జీఐఎస్ సర్వే
మే నెలాఖరుకు పూర్తికి చర్యలు * అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ సీడీఎంఏ అనూరాధ
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 25: నగరంలో చేపట్టిన జీయోలాజికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) ఇప్పటికీ 20 శాతం పూర్తయిందని, మే నెలాఖరుకల్లా సర్వే పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్టు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ సీడీఎంఏ అనూరాధ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం వీఎంసీ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌లో నగరంలో జరుగుతున్న జీఐఎస్ సర్వేపై మేయర్ కోనేరు శ్రీ్ధర్‌తో సమీక్షించిన ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభమైన ఈ సర్వే వాస్తవానికి ఈ నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉందని, సర్వే ఆలస్యంగా ప్రారంభించడం వలన కొద్దిపాటి జాప్యం జరిగిందన్నారు. సర్వేలో ప్రస్తుతం 20 టీమ్‌లు పనిచేస్తుండగా వచ్చే వారం నుంచి 60 టీమ్‌లతో సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు. సర్వే రిపోర్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షించటు థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ వారితో క్రాస్ చెక్ చేయిస్తామని, ప్రతి ఇంటికీ ఇంటి పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, ఓనర్ ఆక్యుపేషన్, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఫైనల్ రిపోర్టును అందిస్తామని వివరించారు. ఈ సందర్భంగా మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ నగరం మొత్తం మీద లక్షా 92 వేల అసిస్‌మెంట్లు ఉండగా ఇంటి పన్ను నిమిత్తం కేవలం 91 కోట్లు మాత్రమే వసూలవుతుందని, ఉన్న అసిస్‌మెంట్లకు అనుగుణంగా ఇంటి పన్ను ఆదాయం రావడం లేదన్న విషయంతో పాటు ఇంటి పన్ను వ్యత్యాసాలను కూడా గుర్తించి, అనధికారికంగా వినియోగిస్తున్న నీటి, డ్రైనేజీ కనెక్షన్లపై నివేదిక అందజేయాలని కోరారు. ఈ సర్వేతో వీఎంసీ ఖజానాకు పన్ను ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ఎటువంటి పొరపాట్లు లేకుండా సమగ్రంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ కమిషనర్ డి చంద్రశేఖర్, డీసీఆర్ జి సుబ్బారావు, సెక్రరటీ జీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.