విజయవాడ

హోదా నినాదానికి కేంద్రం దద్దరిల్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, ఏప్రిల్: రాష్ట్రానికి హోదా ఇవ్వాలనే నినాదం కేంద్రం దద్దరిల్లేలా ప్రభుత్వానికి వినపడాలని స్థానిక శాసనసభ్యుడు బోడే ప్రసాద్ అన్నారు. విభజన చట్టంలోని హామీలను నేరవేర్చాలని కోరుతూ జగన్నాథపురం, మారేడుమాక, తెనే్నరు, మంతెన గ్రామాల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నాయకులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విభజన కారణంగా అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేంద్రం సీమాంధ్రుల మనోభావాలను గౌరవించాలన్నారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయటం ద్వారానే డిమాండ్లు సాధించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గొంది శివరామకృష్ణ, టీడీపీ నాయకులు కే శివయ్య, రామకోటయ్య, రాజా, రవీంద్ర, చిలకలపూడి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

బీసీల పట్ల వైసీపీ కపట ప్రేమ
* టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అనూరాధ విమర్శ
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 26: ఎన్నడూ లేని రీతిలో బీసీల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీసీల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు కూడా లేని వైఎస్ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. చేనేత వర్గానికి సంబంధించి వెంకట నరసయ్య అనే వ్యక్తి ముగ్గు గనులు పాడుకుని అందులో మీ తాతకు ఉద్యోగం ఇస్తే అతన్ని చంపి ఆ రక్తపు కూడుతో బతికిన కుటుంబం వైఎస్‌ది అని ఆరోపించారు. తండ్రి అధికారంలో ఉండగా ఐదేళ్ళలో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే రాష్ట్రంలో 50శాతం ఉన్న బీసీలకు కేవలం మూడు వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 13 జిల్లాలకు బీసీలకు 40వేల కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. మద్యం మాఫియాతో చేతులు కలిపి కల్లుగీత కార్మికుల దుఖాణాలను మూయించడానికి జీవో విడుదల చేసి వారి వృత్తిని నిర్వీర్యం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని విమర్శించారు. నారుూ బ్రాహ్మణుల కులవృత్తి నాదస్వరం డోలు నేర్చుకోవడానికి చంద్రబాబు అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సంగీత కళాశాలలు ఏర్పాటు చేస్తే వైఎస్ వచ్చాక వాటిని మూసి వేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఒక్క బీసీకైనా ఎమ్మెల్యే సీటు ఇచ్చారా అని నిలదీశారు. ఒకప్పుడు ఈశ్వరయ్య తెలుగుదేశం హయాంలోనే జడ్జి అయ్యారన్న విషయం మరిచారా అన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత లేని జగన్మోహన్‌రెడ్డి కపట నాటకాలు ప్రజలకు తెలుసునని అన్నారు.