విజయవాడ

ప్రజాసమస్యలు సత్వర పరిష్కారానికి గ్రామదర్శిని ఓ ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 26: సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామదర్శిని కార్యక్రమం ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. గురువారం ఆయన జిల్లా స్థాయి, కార్పొరేషన్ అధికారులతో కలిసి నగరపాలక సంస్థ పరిధిలో గ్రామ దర్శిని కార్యక్రమం నిర్వహించారు. తొలుత క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా అధికారులతో కలిసి బస్సులో ప్రయాణించి కుమ్మరిపాలెం సెంటర్ వద్ద నుండి 26వ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ జీ హరిబాబుతో కలిసి పర్యటించారు. తొలుత మున్సిపల్ కార్పొరేషన్ సరఫనా చేస్తున్న తాగునీటిని పరిశీలించారు. స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు అసౌకర్యంగా ఉన్నట్లు గమనించిన కలెక్టర్ తక్షణమే వేరొకచోటకు మార్చాలని కోరారు. స్థానికంగా ఉన్న ప్రజలను తాగునీరు తగినంద సరఫరా చేస్తున్నారా? పింఛన్లు అందుతున్నాయా?, కార్పొరేషన్ సిబ్బంది రోజు తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారా?, సంక్షేమ పథకాలు అమలు ఏ విధంగా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కరించవచ్చన్నారు. పథకాలు అమలులో సాంకేతికపరమైన లోపాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను గుర్తించి సజ్జల, నువ్వుల లడ్డూలను అందించడం ద్వారా అదనపు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి కుటుంబం నెలకు రూ. 10వేల ఆదాయాన్ని సమకూర్చుకునేలా అభ్యున్నతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తద్వారా 80 వేల మందికి రుణాలు మంజూరు చేసేలా చర్యు తీసుకుంటున్నామన్నారు. కృష్ణా జిల్లా తలసని ఆదాయం గత రెండు మూడు సంవత్సరాల్లో లక్షా, 20వేల రూపాయలు ఉండేదని, ప్రస్తుత జిల్లా తలసని ఆదాయం రెండు లక్షలకు చేరుకుని ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరిగిందని కలెక్టర్ అన్నారు. నగర పర్యటనలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.