విజయవాడ

నగర పోలీసు శాఖకు ఐపీ-18 అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 26: నగర పోలీసు శాఖకు 10వ నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు (ఐపీ) - 2018 దక్కింది. నకిలీ మందుల మాఫీయా ముఠా కేసును ఛేదించినందుకు దేశంలోని ఉత్తమ పోలీసు యూనిట్‌గా నగర పోలీసు కమిషనరేట్ గుర్తింపు పొందింది. దీంతో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గురువారం కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా నగర జాయింట్ పోలీసు కమిషనర్ క్రాంతిరానా టాటా, వన్‌టౌన్ సీఐ డి కాశీవిశ్వనాథ్‌తో కలిసి ఈ అవార్డు అందుకున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 24న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేగా పాటిస్తున్నారు. ప్రపంచంలోని పలు కంపెనీల పేటెంట్ హక్కులు, ఇతర ఇంటలెక్చువల్ హక్కుల ఉల్లంఘన జరగకుండా కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశ్యం. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం గత పదేళ్ళుగా ఈ అవార్డును ప్రముఖ కంపెనీల పేటెంట్ హక్కులు, ఇంటలెక్చువల్ హక్కుల ఉల్లంఘనలను సమర్ధవంతంగా ఛేదించిన పోలీసులకు అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది నగర పోలీసు కమిషనరేట్‌లోని వన్‌టౌన్ పోలీసులు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన నకిలీ మందుల తయారీ కేసులో విజయవాడ నుంచి రూర్కీ వరకు వారి వ్యాపార రంగాన్ని విస్తరించిన నకిలీ మందుల తయారీ ముఠాను మూలాలతో సహా గుర్తించి ఐదు కోట్ల విలువైన నకిలీ మందులు, తయారీకి ఉపయోగించే వివిధ యంత్రాలను సీజ్ చేశారు. ఈ క్రమంలో విజయవాడ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం ఔషధ మాఫీను గుర్తించి కేసు ఛేదించడంలో విశేష కృషి చేసింది. దీంతో ఈ అరుదైన గౌరవం నగర పోలీసు శాఖ సొంతం చేసుకుంది.