విజయవాడ

నగరంలో పిఎన్‌ఎం కళా సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 13: సిఐటియు 14వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని ప్రజానాట్యమండలి (పిఎన్‌ఎం) ఆధ్వర్యంలో నగరంలో కళాసంబరాలు జరగనున్నాయి. పనిలో అలసిపోయిన కార్మికులకు స్వాంతన కలిగించేవి కళలే. అంతేకాకుండా కళాప్రదర్శన ద్వారా ఇచ్చే సందేశం హృదయాలను తాకుతుంది. వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా దుర్గాపురంలోని కార్మిక భవన్‌లో దాదాపు 30 మంది కళాకారులు తమ ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. కృష్ణాజిల్లా, విజయవాడ నగరం నుంచి వచ్చిన ప్రజా కళాకారులు పి.కవి రచించి దర్శకత్వం వహించిన ‘కదిలి రావోయి కార్మికుడా’ అనే వీధి నాటకంతో పాటు, అభ్యుదయ గీతాలు, డ్యాన్స్, సందేశాత్మక స్కిట్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ కళారూపాలను ఈనెల 15 నుంచి 21 వరకు నగరంలోని మూడు నియోజకవర్గాల్లోని 126 కార్మిక అడ్డాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. వీరితో పాటు మూడు రాష్ట్ర కళాబృందాలు కూడా పాల్గొననున్నాయి. ఈ కళాకారులు 26న నగరంలో నిర్వహించ తలపెట్టిన మహా ప్రదర్శనకు తరలివచ్చి సిఐటియు 14వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు. కళాకారులు పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి, రచయిత, దర్శకులు ఆర్.రాజేష్, కొరియోగ్రాఫర్ వినోద్‌లు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలను పిఎన్‌ఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాదె సుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకులు జివి రంగారెడ్డి, జిల్లా నాయకులు జి.నటరాజుల పర్యవేక్షణతో పాటు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు.