విజయవాడ

దుర్గమ్మ భక్తులకు రూ. 13కోట్లతో కాటేజీ సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) మే 16: దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం గొల్లపూడిలో ఐదు అంతస్తుల (జి+4) కాటేజీలను సుమారు 13 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు విజయవాడ దుర్గగుడి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు నిర్ణయించింది. పాతబస్తీలోని మాడపాటి వేంకటేశ్వరరావువసతి కేంద్రంలో బుధవారం ఉదయం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కమిటీ ధర్మకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను దేవస్థానం ఈవో ఎం పద్మ, కమిటీ చైర్మన్ వి గౌరంగబాబు విలేఖరులకు తెలియజేశారు. కాటేజీలను దాతల ఆర్థిక సహాయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంగా చేస్తున్నట్లు వివరించారు. దేవస్ధానానికి చెందిన వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 140 ఎకరాలను 3 సంవత్సరాల పాటు లీజ్‌కు ఇచ్చేందుకు కొద్ది రోజుల్లో బహిరంగ వేలం పాటలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. అమ్మవారి హుండీలు, విరాళాలు, వివిధ మార్గాల్లో వచ్చిన వెండి మొత్తాన్ని ఈ- వేలం నిర్వహించి వచ్చిన సొమ్ముతో బంగారాన్ని కొనుగోలు చేసి, నగదును ఎస్‌బిఐ గోల్డ్ బాండ్ స్కీం పద్దతిలో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇదేవిధంగా ఐడిబిఐ లాకర్లలో ఉన్న బంగారం కడ్డీలు, దేవస్థానం వద్ద ఉన్న బంగారం, అన్నింటినీ కలిసి ఎస్‌బిఐలో గోల్డ్ బాండ్ స్కీం కింద ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదేవిధంగా కొండపైన శిథిలావస్థలో ఉన్న శ్రీ పాశుపతేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

దుర్గమ్మ భక్తులపై భారం
* ట్రస్ట్‌బోర్డు వచ్చిన తర్వాత సేవా టిక్కెట్ల ధరల పెంపు
ఇంద్రకీలాద్రి, మే 16: గతంలో కేవలం రూ. 300 టిక్కెట్ ధర ఉండే అమ్మవారి శాంతి కల్యాణం టిక్కెట్ ధరను తాజాగా ఏకంగా రూ.1000లకు పెంచుతూ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు కమిటీ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పాతబస్తీ మాడపాటి వేంకటేశ్వరరావువసతి భవన్‌లో బుధవారం ఉదయం దుర్గగుడి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. ఈసమావేశంలో సభ్యులు ఆమోదించిన వివిధ కీలక నిర్ణయాలను దేవస్థానం ఈవో ఎం పద్మ, కమిటీ చైర్మన్ వీ గౌరంగబాబు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. శాంతి కల్యాణం చేయించుకున్న భక్తులను ఇకనుండి అమ్మవారి ముఖ దర్శనం కాకుండా నేరుగా అంతరాలయంలోకి పంపే విధంగా నిర్ణయించిన కారణంగానే ఈటిక్కెట్ ధరను పెంచినట్లు వారు ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అమ్మవారి ఉపాలయాలైన నటరాజ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వచ్చే భక్తులకు ఇంకా నుండి ఉచితంగా ప్రసాదాలను పంపిణీ చేయుట, కేశ ఖండనశాలలో పనిచేస్తున్న క్షరకుల చేతులకు గ్లౌజ్‌లు, నోటికి మాస్క్‌లు ఇచ్చేందుకు ఆమోదించినట్లు వారు తెలిపారు. శ్రీ మల్లిఖార్జున మహామండపానికి ఉత్తర భాగంలోని పవిత్ర వనం, పరిసరాల ప్రాంతాలను గ్రీనరీ అభివృద్ధి చేసేందుకు ఏపీ అర్బన్ గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్‌కు ఇచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈసమావేశంలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు గూడపాటి పద్మశేఖర్, వెలగపూడి శంకరబాబు, సాంబశివరావు, కే సూర్యలతకుమారి, పాప, చనుమోలు సాంబసుశీల, పెంచలయ్య, రాజా, ధర్మారావు, రామ్ ప్రసాద్, లింగంబొట్ల దుర్గా ప్రసాద్, విజయ్‌శేఖర్, లక్ష్మీనరసింహారావు, రామనాథమ్, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా రాజశేఖర స్వామి రథోత్సవం
అవనిగడ్డ, మే 16: స్థానిక శ్రీ రాజశేఖర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల్లో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు హారతులు సమర్పించుకున్నారు. తొలుత బలిహరణ, రథ బలి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఇఓ మురళీకృష్ణ, చైర్మన్ రామనాదబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు.