విజయవాడ

వీఎంసీ స్కూళ్ల అభివృద్ధికి నిధుల మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 24: వీఎంసీ పాఠశాలల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈమేరకు గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణిలను మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని వినతిపత్రాలను అందించిన మేయర్ శ్రీ్ధర్ మరికొద్ది రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లు తెరిచేలోపు బెంచీలు, తరగతి గదులు, కనీస వసతుల కల్పనకు అవసరమైన రూ. 5కోట్లను కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి గంటా తక్షణమే రూ.2 లేదా రూ. 3కోట్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తదుపరి వీఎంసీ ఉద్యోగులకు 010 జీవో జీతాలు, వీఎంసీ ఆఫీస్ ఆవరణలో అసంపూర్తిగా ఉన్న 11 అంతస్తుల భవన నిర్మాణ పూర్తికి తగు అనుమతులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని శ్రీ్ధర్ కోరారు.

అక్రమ నిర్మాణాలకు బ్రేక్!
* అనుమతిలేని 7 నిర్మాణాలను అడ్డుకున్న సీఆర్‌డీఏ అధికారులు
విజయవాడ (కార్పొరేషన్), మే 24: సీఆర్‌డీఏ పరిధి ప్రాంతాల్లో అనుమతి లేని భవన నిర్మాణాల నిరోధక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆదేశాల మేరకు గురువారం యనమలకుదురు, పెదపులిపాక, కొలనుకొండ తదితర ప్రాంతాల్లో మొత్తం 7 భవనాల నిర్మాణ పనులను అడ్డుకున్నారు. యనమలకుదురులో 3 భవనాల బేస్‌మెంట్ లెవల్, ఒక ఫస్ట్ ఫ్లోర్ సెంట్రింగ్ పనులు, పెదపులిపాకలో రోడ్డు మార్జిన్‌ను ఆక్రమించి చేపడుతున్న నిర్మాణ పనులను నిలిపివేసి పిల్లర్‌ను తొలగించారు. అలాగే కొలనుకొండలో ఒక షెడ్, మరో భవన బేస్‌మెంట్ లెవల్ నిర్మాణ పనులను నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌డీఏ జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ గుమ్మడి ప్రసాదరావు, జేపీవో జీ ఉమామహేశ్వరరావు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు హరిణి, కరుణ, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.