విజయవాడ

మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, మే 25 : మండలంలోని కుందేరులో శుక్రవారం జాయింట్ కలెక్టర్ విజయక్నష్ణన్ ఆకస్మికంగా పర్యటించారు. కుందేరు వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా గ్రామానికి చెందిన కొద్దిమంది తమ స్థలాన్ని నష్టపోతున్నారు. వీరికి గ్రామంలో ఎకరా భుమి ధర ఎంత ఉందో చూసి దాని ప్రకారం చెల్లించేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. పునాదిపాడు నుంచి పెదపారపూడి వెళ్లే రహదారిపై కుందేరు రైవస్ కాలువ వంతెన నిర్మాణ పనులకు రూ 6.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు 2015లో శంకుస్థాపన చేశారు. వంతెన దిగువ ఐదుగురు వ్యక్తులకు చెందిన 14 సెంట్ల భుమి ఉంది. దీనిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులు బాధితులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకపోవటంతో వారు పనులను అడ్డుకున్నారు. దీంతో రెవెన్యు అధికారులు కలెక్టరు దృష్టికి సమస్య తీసుకెళ్లారు. బాధితులకు వేరే చోట స్థలాలు కేటాయిస్తామని చెప్పి కొద్దికాలం గడిపారు. స్థలాలు కేటాయించకపోవటంతో వంతెన నిర్మాణ పనులు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో అధికారులపై గ్రామస్థుల ఒత్తిడి పెరిగింది. ఇక చేసేది లేక బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చారు. దీనిలో భాగంగా శుక్రవారం జేసీ స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎకరా మార్కెట్ విలువ ఎంతుందో లెక్కకట్టి 14 సెంట్లు భుమి హక్కుదారులకు అదే విలువ చొప్పున చెల్లించమని జేసీ విజయక్నష్ణన్ తాహశీల్దారు ఎల్లారావుని ఆదేశించారు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ విలువ ఎకరాకు 53.24 లక్షలున్నట్లు తెలిపారు. ఆ విధంగా భాధితులకు చెల్లింపులు చేయునున్నట్లు ఎల్లారావు చెప్పారు. పనులు వెంటనే ప్రారంభించాలని జేసీ అధికారులను ఆదేశించారు.