విజయవాడ

పనులను పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 25: అమరావతి రాజధాని నగర పరిధిలో నిర్మిస్తున్న ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టు పనులను ముందుగా నిర్ధారించిన నిర్ణీత కాలంలోనే పూర్తయ్యేలా పనులను వేగవంతం చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ శుక్రవారం నగరంలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ రాయపూడిలో చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారుల నివాసాలు, నేలపాడులో ఎన్జీవో, గజిటెడ్, గ్రూప్ డీ నివాసాల పనులను లక్ష్యానికి అనుగుణంగా పూర్తిచేయాలని కాంట్రాక్ట్ సంస్థలను ఆదేశించారు. అలాగే సీఆర్‌డీఏ ప్రాజెక్టు ఆఫీస్, బంగ్లాలు, ఇంటీరియం హైకోర్టు, ఎల్పీఎస్ లే అవుట్ పనులను కూడా సమీక్షించి పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలంలోపు అన్ని ప్రాజెక్టుల ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించిన కమిషనర్ శ్రీ్ధర్ ఆయా ప్రాజెక్టులకు ఇన్‌ఫ్రా, నీటి సరఫరా పనులపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. టార్గెట్ ప్రకారం పనులు చేసే విధంగా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ఎన్‌సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ, కేఎంవీ మెగా, బీఎస్‌ఆర్, ప్రీకా కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, పీఎంసీల ప్రతినిధులు, సీఈలు మాదాసు జకరయ్య, టీ ఆంజనేయులు, శ్రీనివాసులు, ఎస్‌ఈ సిహెచ్ ధనుంజయ, ప్రాజెక్టు మేనేజర్ సిహెచ్ దొరబాబు పాల్గొన్నారు.
ఉచ్ఛతర్ శిక్షా అభియాన్‌లో అవినీతిపై
సీబీఐ విచారణ జరిపించాలి

బెంజిసర్కిల్, మే 25: ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా)లో అవినీతికి పాల్పడిన అధికారి పండాదాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి డిమాండ్ చేశారు. రూసాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ వైకాపా విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ధర్నాను ఉద్దేశించి వైకాపా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ సుజాత శర్మ విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహించిన పండాదాస్ రాష్ట్ర ఉచ్చతర్ శిక్షా అభయాన్‌లో నిధులను పెద్ద ఎత్తున పక్కదారి పట్టించినట్లు ఆరోపించారు. ముఖ్యంగా ఈ పథకం కింద నిర్వహించే డిజిటల్ తరగతుల కోసం ఒక్క కళాశాలకు నాలుగు లక్షల రూపాయలను కేటాయించిన సందర్భంలో తరగతులను నిర్వహించకుండానే జరిగినట్లు చూపించి ఆ నిధులను పక్కదారి పట్టించినట్లు వెల్లడించారు. సుజాత శర్మ విధులోనికి వచ్చిన తరువాత విషయం బయటకు రావడంతో ఆయనపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఆయనను జేకేసీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్‌తో కలిపి కమిషనరేట్ నుండి బదిలీ చేసిందన్నారు. ప్రభుత్వ నిధుల్లో అవినీతికి పాల్పడిన పండాదాస్‌పై చర్యలు తీసుకోకుండా బదీలీ చేయడంలోప్రభుత్వ పెద్ద అంతర్యమేమిటన్నారు. పండాదాస్‌పై సీబీఐ విచారణ జరిపించి, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో విద్యార్ధి విభాగం నాయకులు రాజేష్, సతీష్, అర్జున్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.