విజయవాడ

ఉద్యోగులను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మే 25: రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం గాలికోదిలేసిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శాసనమండలి సభ్యుడు వెన్నపూస గోపాలరెడ్డి విమర్శించారు. ఉద్యోగుల కనీస, అవసరాలను కూడా తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వాటిని పరిష్కారించాల్సిన ఆశోక్‌బాబు ప్రభుత్వానికి డబ్బా కొడుతూ సొంత వ్యాపకాలతో కాలం గడుపుతున్నట్లు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పదో పీఆర్సీ గడువు ముగుస్తోందని అందువల్ల 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, ఒక జేఏసి నేత ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొనడం దారుణమన్నారు. అంటే ఉద్యోగులకు 11వ పీఆర్సీతో పాటు పదో పీఆర్సీ బకాయిలు ఇప్పించాల్సిన అశోక్‌బాబుకు కనీసం ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చే తీరిక లేకుండా పోయిందన్నారు. ఉద్యోగల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఉద్యోగుల సంఘం నేత అశోక్‌బాబు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేస్తున్న ఆయన పక్కరాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం దారుణమన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అశోక్‌బాబు పీఆర్సీ జీఓలో పేరు కోసం పోరాటం చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ను కలిసి 11వ పీఆర్సీ ఏర్పాటు చేయాలంటే ముందుగా 10వ పిఆర్సీ బకాయిలను చెల్లించాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద తగినంత డబ్బు లేనందున చెల్లించలేమని చెప్పారని, ఇప్పటికే రెండు డిఏలు కూడా ఇవ్వాల్సి ఉందని దానిపై కూడా ప్రభుత్వంపై స్పందన లేదన్నారు. మరో వైపు పెన్షన్ల చెల్లింపులలో పొరపాట్లు జరిగాయని కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అని నూతన విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పిన ఆయన దీని కారణంగా 25 శాతం మంది పెన్సనర్లకు ఇంత వరకు పెన్సన్లు అందడం లేదన్నారు. ఇటువంటి వ్యవస్థలు తేవడంతో పెన్సనర్ల ఇబ్బందులు మరింత పెరుగుతున్నట్లు ఆరోపించారు. ఉద్యోగులు, పెన్సనర్లు మృతి చెందితే ప్రభుత్వం చెల్లించే దహనసంస్కారా ఖర్చులు కూడా వెంటనే ఇవ్వడం లేదన్నారు. దాదాపు నెల రోజుల సమయం తీసుకోవడంతో కుటుంబాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు, పెన్సనర్లకు ఇచ్చిన హెల్త్ కార్డులు సరిగా పని చేయడం లేదన్న ఆయన ప్రభుత్వ అసుపత్రుల్లో సౌకర్యలు దారుణంగా ఉన్నాయన్నారు. కొన్ని సందర్భాల్లో కనీసం మందులు కూడా లభించిన పరిస్థితి ప్రభుత్వ అసుపత్రుల్లో ఉందన్నారు. తిరుమల వెంకన్న అలయంలో వస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.