విజయవాడ

బాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మే 25: అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోచుకోవడం, మోసపుచ్చడమే పరిమావధిగా సాగిన బాబు పాలనకు చరమాంకానికి రోజులు దగ్గర పడ్డాయని, ఉన్న కొద్దిరోజుల్లోనైనా మంచి పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. తన అధికార దాహం కోసం పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఎవరితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే పలు సందర్భాల్లో కొత్త నాటకాలకు తెర తీసిన బాబు నవనిర్మాణ దీక్ష పేరుతో మారోసారి సరికొత్త నాటకంతో రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకాశవాదంతో వాడుకుని వదిలేసే చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదన్న విషయాన్ని ఆయన గ్రహించాలని సూచించారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశంలోని ఉన్న అన్నీ పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారం అనుభవించి వారితో తెగతెంపులు చేసుకున్నారని తెలిపారు. ఏరు దాటాక తెప్పతగలేసిన చందాన ఏ పార్టీతో అవసరం ఉంటే ఆ పార్టీతో జతకట్టి అవసరం తీరిన తరువాత వారిని పక్కన పెట్టడం చంద్రబాబు నైజమన్నారు. తన అవసరం కోసం ఏ పార్టీనైనా, వ్యవస్థనైనా దిగజార్చే చంద్రబాబు అవసరం అనుకుంటే అబద్ధాలను కొత్త అబద్దాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారని తెలిపారు. కర్నాటక వ్యవహారంలోనే బాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్న విషయం అవగతమవుతోందన్నారు. ఢిల్లీలో పొత్తుల కోసం మొదట ప్రయత్నించిన బాబు అక్కడ విఫలం కావడంతో కర్నాటకలో పొత్తుల కోసం ప్రయత్నించినట్లు చెప్పారు. సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేని బాబు పొత్తులతో మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కలసి కట్టుగా పోరాటం చేద్దామని బాబు పిలుపునిస్తే రాష్ట్రంలో ఏ పార్టీ ముందుకు రాలేదని గుర్తు చేశారు. ఇక నవనిర్మాణ దీక్ష పేరుతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పాలు చేసేందుకు ముందుకు వస్తున్న బాబు దాని ద్వారా మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజల డబ్బుతో ప్రభుత్వ డబ్బును ఖర్చు చేసి ప్రచారం పోందేందుకు బాబు ఈ నవనిర్మాణ దీక్షలను 13 జిల్లాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపించారు.