విజయవాడ

నీటితోనే ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణ విధానాల అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థర్ధవంతంగా వినియోగంలోకి తేవడం ముఖ్యమని, యువత ఆ దిశగా మార్గదర్శకంగా నిలవాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఎ1 సమావేశ మందిరంలో మంగళవారం చీఫ్ ఇంజనీర్ వైఎస్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన 23వ ప్రపంచ జల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణాలను చేపట్టి మన ప్రతిభను ప్రపంచానికి తేటతెల్లం చేస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి ముఖ్యంగా ఇంజనీర్లు రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల పనితీరు క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు సందర్శించాలని అన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. గత సంవత్సరం మార్చిలో ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు పనులు ఈ ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేసి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు సాగునీరు, మంచినీరు అందించడానికి సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అత్యంత ఆధునికతతో చేపడుతున్న డయాఫ్రమ్ నిర్మాణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అవగాహన పెంచుకోవాలన్నారు.
సర్ ఆర్దర్ కాటన్, మోక్షగుండం విశే్వశ్వరయ్య, కెఎల్ రావ్ తదితరుల జీవిత గాథలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు.
రాష్ట్ర ఎఫిక్స్ కమిటీ సభ్యులు, జలసంరక్షణ సంఘ అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు, మంచినీరు అవసరాలు పూర్తి స్థాయిలో తీర్చేందుకు 2750 టిఎంసిల నీరు అవసరం అవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం భూతలం ద్వారా 777, ఎగువ రాష్ట్రాల, నదీ పరివాహక మార్గాల ద్వారా 1134 టిఎంసిల వెరసి 2271 టిఎంసిల నీరు అందుబాటులోకి రావడం జరుగుతుందన్నారు. ఇంకా 479 టిఎంసిల నీటి లోటు ఎదుర్కొంటున్నట్లు ఆయన వెల్లడించారు. బ్రష్ చేసుకోవడం కోసం ట్యాపు మినియోగించే వ్యక్తులు 15 లీటర్ల నీరు, గడ్డం గీసుకునే సందర్భంలో 18 లీటర్ల నీరు వృధా చేస్తున్నారని అవసరమైన సందర్భంలోని ట్యాపు వినియోగించడం ద్వారా అతి తక్కువ నీటితో ఆ పనులను పూర్తి చెయ్యగలుగుతామని యువత తప్పనిసరిగా నీటి దుర్వినియోగం కాకుండా చూడాలని తెలిపారు. ఎపి రాష్ట్ర జలవనరుల సలహాదారు చెరుకూరి వీరయ్య చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో జల వనరులను సమర్ధవంతంగా వినియోగించడానికి, అందుబాటులో వున్న వనరుల ద్వారా ప్రాజెక్టులను పూర్తిచెయ్యడానికి చూపుతున్న చొరవ అభినందనీయమని తెలిపారు. కెఎల్‌యు వైస్‌ఛాన్సలర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న బందరు కెనాల్‌ను ప్రక్షాళన చెయ్యడానికి కెఎల్‌యు విద్యార్థులతో శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని ఇందుకు సంబంధించి కార్యాచరణ కార్యక్రమాన్ని ఇరిగేషన్ అధికారులకు తగు అనుమతుల కోసం పంపుతామన్నారు. కెఎల్‌యు మెకానికల్ హెడ్ శ్రీనాధ్ మాట్లాడుతూ నీటి వినియోగాన్ని సమర్ధవంతంగా వినియోగించడంలో, సంరక్షణ చర్యలు చేపట్టడంలో సివిల్, మెకానికల్ విద్యార్థులు సమర్ధవంతమైన విధి విధానాలను రూపొందించాలన్నారు. పోలవరంలో పర్యటించిన పలువురు విద్యార్థులు తమ అనుభవాలు వివరించారు. ఈ సమావేశంలో పిసి చైర్మన్ గుట్ట శివరామకృష్ణ, పిసి చైర్మన్ ఎన్‌ఎస్‌ఎల్‌సి వై.పుల్లయ్య చౌదరి, డాక్టర్ వర్ల, గోదావరి వెస్ట్రన్ డెల్టా పిసి చైర్మన్ పి.రామాంజనేయరాజు, డిడి గ్రౌండ్ వాటర్ ఎ.వరప్రసాద్, నీటి పొదుపు వినియోగంపై కెఎల్‌యు విద్యార్థులు రూపొందించిన లఘుచిత్రం ప్రదర్శించి, సంరక్షణా చర్యలు యువత బాధ్యత అనే అంశాలపై ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న జలసంరక్షణ చర్యలపై నీటి సంఘాల అధ్యక్షులకు, సభ్యులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పుస్తకావిష్కరణ గావించారు.