విజయవాడ

దుర్గమ్మ సన్నిధిలో తప్పిపోయిన చిన్నారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 17: తల్లిదండ్రులతో కలిసి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన చిన్నారి నవ్యశ్రీ దుర్గగుడిలో తప్పిపోయిన సంఘటన దుర్గగుడిలో సంచలనం రేకెత్తించింది. సుమారు 15గంటల పాటు చిన్నారి ఆచూకీ లభించకపోవటం దుర్గగుడి చరిత్రలో ఇదే తొలిసారి. చివరికి నరసరావుపేట లో పాప ఆచూకీ లభించటంతో అం దరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరా ల్లోకి వెళితే శ్రీకాకుళం, అరసబలగారా జాం మండపానికి చెందిన పైడిరాజు, శ్రీదేవి దంపతులు దుర్గమ్మ దర్శనం నిమిత్తం ఆదివారం ఉదయం కుమార్తె నవ్యశ్రీ కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చారు. దుర్గమ్మ దర్శనం నిమిత్తం వారు క్యూ లైన్‌లో ఉండగా చిన్నారి నవ్యశ్రీ తప్పిపోంది. ఈ విషయాన్ని గమినించిన తల్లిదండ్రులు వెంటనే దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దేవస్థా నం వారు అనౌన్స్‌మెంట్ చేయించినప్పటికీ సాయంత్రం వరకు నవ్యశ్రీ ఆ చూకీ లభించలేదు. నవ్యశ్రీ తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు. అమ్మవారి సన్నిధిలో ఆదివారం, శుక్రవారం, పర్వదినాల్లో ప లువురు తప్పిపోతూ ఉంటారు. వారి బంధువులు వెంటనే ఈవిషయాన్ని దేవస్థానం అనౌన్స్‌మెంట్ ద్వారా ప్రచా రం చేయించిన వెంటనే తప్పిపోయిన వారి ఆచూకీ తెలుస్తుంది. ఏదిఏమైనా చివరికి చిన్నారి ఆచూకీ లభ్యం కావటం ఆ దుర్గమ్మే పాపను దొరికేలా చేసిందని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.

రామవరప్పాడు మసీదుకు స్థలం కేటాయించాం
విజయవాడ, జూన్ 17: నగరంలోని రామవరప్పాడు విస్తరణలో భాగంగా తొలగించిన మసీదుకు రామవరప్పా డు - గుణదల రహదారి వద్ద 250 గ జాల స్థలాన్ని కేటాయించామని కలెక్ట ర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రం జాన్ ప్రార్థనల అనంతరం కొంత మం ది ముస్లిం సోదరులు మసీదును తొలగించిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రాగా పక్కనే ఉన్న కలెక్టర్‌ను వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. వెంటనే స్పం దించిన కలెక్టర్ స్థానిక తహశీల్దార్, ఆర్డీఓను సంప్రదించి మసీదు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించమని ఆదేశించారు. మసీదుకు స్థలాన్ని కేటాయించడం పట్ల స్థానిక ముస్లిం పె ద్దలు, ముస్లిం సోదరులు హర్షం వ్య క్తం చేశారు. త్వరలో నిర్మాణపు పను లు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.