విజయవాడ

దుర్గమ్మ సేవలో కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 17: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఆదివారం ఉదయం కలెక్టర్ బీ లక్ష్మీకాంతం దం పతులు దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. వీరికి సహా య ఈవో శ్రవణం అచ్యుత రామయ్యనాయుడు ఆలయ మర్యాదలతో స్వా గతం పలికారు. అమ్మవారి దర్శనం త ర్వాత వీరికి అర్చకులు దివ్య ఆశీస్సులి చ్చి ప్రసాదాలను అందచేశారు.

అభివృద్ధి కేవలం టీడీపీ వాళ్లకే
విజయవాడ(బెంజిసర్కిల్), జూన్ 17: రాష్ట్రంలో కనిపిస్తున్న అభివృద్ధి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే కనిపిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మె ల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన వి లేఖరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చా క కేటాయిస్తున్న అభివృద్ధి నిధులు కేవలం టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే కేటాయిస్తున్నట్లు ఆరోపించారు. అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో జరుగుతున్న వివక్షతపై సీఎం చంద్రబాబును కలిసి వైకాపా ఎమ్మెల్యేలు వివరించినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. కొనుగోలు చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రం ప్రయోజనం చేకూర్చుతున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రం కోసం గళమెత్తుతానని చెప్పిన సీఎం చంద్రబాబు భయంతో రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడలేని స్థితి కనిపించిందన్నారు. ఏదో ప్రయోజనం చేకూరుతుందని భావించిన ఏపీ ప్రజలను బాబు దారుణంగా మోసం చేసినట్లు తెలిపారు. పాత చింతకాయపచ్చడి తీరుతో చంద్రబాబు ప్రసంగం కొనసాగిందని చెప్పిన ఆయన బాబు వీరోచితం ఎక్కడా కనపడలేదనన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు అవినీతిలో రాజ్యమేలుతుంటే వారికి అధిపతిగా నీతి అయోగ్ సమావేశానికి బా బు హాజరు కావడం దారుణమన్నారు. ఇప్పుడు అవకాశ వాద రాజకీయాల కోసం కేజ్రీవాల్‌ను బాబు వాడుకుంటున్నట్లు ఉదహరించారు. బీజేపీ రాజకీయాలను, అవినీతిని బయటపెడతామ ని చెప్పిన టీడీపీ నేతలు నోరు ఎందు కు మెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీలు కలసి రాష్ట్ర రాజకీయాల్లో డ్రామాలాడుతున్నట్లు తెలిపా రు. టీడీపీ అధికారంలోకి వస్తుందం టూ జరుగుతున్న సర్వేల్లో వాస్తవం లే దన్న ఆయన బాబుకు ఊడిగం చేస్తు న్న వారి నాటకంగా తెలిపారు. జగన్ పాదయాత్ర నుండి రాష్ట్ర ప్రజలను దా రి మళ్లించేందుకు బాబు చేస్తున్న కుట్ర గా తెలిపారు. ఈ సర్వేలకు వైకాపా కా ర్యకర్తలు భయపడాల్సిన అవసరం లే దన్నారు. ఇక తిరిగి సీఎం అయ్యే ఛా న్స్ బాబుకు లేదన్నారు. చంద్రబాబు పతనం ఎప్పుడో ప్రారంభమైయ్యిందన్న ఆయన రాష్ట్ర ప్రజల దృష్టిలో టీడీపీ ఎప్పుడో ఓడిపోయిందన్నారు.