విజయవాడ

దుర్గమ్మకు బోనాల సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 17: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరగా పూర్తికావాలని, ఇందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమ్మవారికి భక్తితో బోనాలు సమర్పించారు. ఆదివారం ఉదయం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీ్ధర్, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి చంటి,తదితరులు వెంట రాగా తొలుత ఘాట్‌రోడ్ మార్గం ప్రారంభంలో ఉన్న శ్రీ కామధేన్ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి తర్వాత దేశం కార్యకర్తలు వెంటరాగా ఘాట్‌రోడ్ మార్గం గుండా నడుస్తూ కొండపైకి చేరుకున్నారు. మంత్రి దేవినేని తీసుకొచ్చిన బోనాలకు దేవస్థానం ఈవో ఎం పద్మ, దుర్గగుడి కమిటీ చైర్మెన్ వీ గౌరంగబాబు, ధర్మకర్తలు వెలగపూడి శంకరబాబు, పద్మశేఖర్, పెంచలయ్య, సూర్యకుమారి, సాంబ సుశీల, లింగంబొట్ల దుర్గా ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈబోనాలను అర్చకులు స్వీకరించి అమ్మవారికి సమర్పించారు. ఈసందర్భంగా మంత్రి దేవినేని అమ్మవారికి ప్రత్యేక పూజలను చేశారు. తర్వాత మంత్రికి ఈవో ఎం పద్మ దుర్గమ్మ చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. ఈకార్యక్రమంలో సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎన్ని దుష్ట శక్తులు అడ్డుపడినా పోలవరం ఆగదు
ఎన్ని దుష్టశక్తులు ఆటంకాలు కల్పించినప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ ఆగదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి ఆటంకం కల్పించాలనే ఉద్దేశంతోనే కొన్ని పథకాలను రచించి అకారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ త్వరలో పూర్తి అవుతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
క్షురకులకు మంత్రి దేవినేని హామీ
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుర్గగుడి క్షురకులకు హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఘాట్‌రోడ్ శ్రీ కామధేన్ అమ్మవారికి బోనాలు సమర్పించుకోవటానికి ఘాట్ రోడ్ వద్దకు వచ్చారు. ఈసందర్భంగా ఆందోళన చేస్తున్న క్షురకులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ ఈ విషయాలపై ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో తాను మాట్లాడుతున్నానని, ప్రభుత్వం నుంచి త్వరలోనే సానుకూల ప్రకటన రాగలదన్నారు. ఈ విషయంలో తాను బాధ్యత తీసుకోగలనన్నారు. మంత్రి వెంటనే మేయర్ కోనేరు శ్రీధర్, దుర్గగుడి ఛైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ తదితరులున్నారు.