విజయవాడ

ముఠా కార్మికుల కూలిరేట్లు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: నగరంలోని వివిధ ముఠాల్లో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే కూలిరేట్లు పెంచాలని సీఐటీయు పశ్చిమ కృష్ణా జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ వెంకటేశ్వరరావు, ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రోజురోజుకూ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కూలిరేట్ల పెంపునకు యాజమాన్యాలు సహకరించాలని కోరారు. న్యాయమైన సమస్యపై ఆందోళన చేస్తున్న ముఠా కార్మికులకు మద్దతు తెలపాలని ఉద్యోగులు, కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఒప్పదం ప్రకారం కూలిరేట్లు పెంచాలని ముఠా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కోర్కెల పత్రం ఇచ్చిందన్నారు. వ్యక్తిగతంగా కలిసి కూడా కూలిరేట్ల ఒప్పందానికి చర్చలకు పిలవాలని కోరింది. కానీ యాజమాన్యాల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంగళవారం వన్‌టౌన్, టూటౌన్‌లలో ముఠా కార్మికులు పని బంద్ చేసి ప్రదర్శన నిర్వహించాల్సి వచ్చిందన్నారు.

జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ
చైర్మన్‌కు తెలుగుయువత అభినందన
విజయవాడ, జూన్ 19: జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఎన్నికైన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్‌ను జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సమక్షంలో జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు చెంబేటి కృష్ణబాబు, జిల్లా యువత కార్యదర్శి షేక్ మొహ్మద్ సల్మాన్ పార్టీ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా వారు కేక్ కట్ చేసి ఆయనకు తినిపించారు.