విజయవాడ

భారతీయులు ప్రపంచంలోనే గొప్ప జ్ఞాన సంపన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూన్ 16: భారతీయులు ప్రపంచంలోనే గొప్ప జ్ఞాన సంపన్నులని వీరిని శాస్తవ్రేత్తలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత గురువులపై ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని అనే్న సీతారామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి విద్యాంజలి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఏ దేశ పిల్లలకు లేని జ్ఞాన సంపద భారతీయ పిల్లల్లోనే ఉందని, భారతీయులు మాత్రమే ప్రపంచంలో ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారన్నారు. పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకోకపోతే ఆ పిల్లల తల్లిదండ్రులదే లోపమన్నారు. పిల్లల్లో మంచి జ్ఞాన సంపద, మంచి విశే్లషణ శక్తి ఉందని, మన బాలలు మట్టిలో మాణిక్యాలని వారిలో సృజనాత్మక శక్తి పెంచాలన్నారు. చిన్ననాటి నుండే పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరగడానికి మంచి పుస్తకాలు చదవటం, మాట్లాడే విధానం తదితర వాటిపై అవగాహన కల్పించడానికి గతంలో ఉన్న శిఖరాలు అధిరోహించిన వారు డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్తవ్రేత్తలు, స్థానికంగా చదివిన పాఠశాలలు సందర్శించి, విద్యార్థులతో మమేకం కావాలన్నారు. ఇటీవల ఎయిమ్స్, జిప్‌మార్, జి తదితర పరీక్షా ఫలితాలలో మొదటి 10 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే సాధించారని, ఇందుకు మన ఆంధ్రప్రదేశ్ పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తి జ్ఞాన సంపదకు తార్కాణమన్నారు. కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా తీర్చిదిద్దుతామని, రేషనల్ లైజేషన్ చేసి ప్రతి పాఠశాలలోనూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం చేపడతామన్నారు. ప్రతి పాఠశాలలోనూ బాలికలకు, బాలురకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఫర్నిచర్ తదితర వౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి వసతి గృహాన్ని రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్పు చేసి గుణాత్మక విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని, ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలన్నారు. నీటి మట్టాలను పెంచడానికి పెద్ద ఎత్తున ఇంకుడు గుంటలు, నీటి నిల్వలకు పెద్ద కట్టడాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సంవత్సరం నుండి 9వ తరగతి బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని, మగ పిల్లలతో పాటుగా బాలికలు అన్ని రంగాలలో ముందు ఉండాలని అన్నారు. మనిషి జీవితం పవిత్రమైందనీ, విలువైందన్నారు. రాబోయే కాలంలో కాలేజీలకు వైఫై, ఇంటర్‌నెట్ సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతి గృహానికి 15ఎంబిపిఎస్ నెట్ సదుపాయం కల్పించనున్నామని, దీంతో ఉపాధ్యాయులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకుని విద్యార్థులకు విద్యాబోధన చేయవచ్చన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోనే ఒక పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రపంచదేశాల వారందరికీ అమరావతే నాలెడ్జిహబ్‌గా వినియోగించుకునేలా తీర్చిదిద్దనున్నట్లు సిఎం చెప్పారు. అంతకు ముందు కార్యక్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముత్తవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇప్పటికీ దేశంలో 40శాతం మందికి చదవడం, రాయడం రాదని ప్రతి గ్రామంలోను చదువుకున్న వారు బయటికి వెళ్లిపోయినా తిరిగి జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.