విజయవాడ

నగర పోలీసుల యోగాభ్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పోలీసు శాఖ, యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం యోగాభ్యాసం జరిగింది. నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ఆదేశాలతో బందరురోడ్డులోని ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనరేట్‌లోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగసనాలు అభ్యసించారు. దైనందిన జీవితంలో యోగాసనాల వల్ల కలిగే మానసిక, శారీరక ఆరోగ్యం, వివిధ యోగాసనాలు ఆచరించడం వల్ల మార్పులు, ప్రయోజనాల గూర్చి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు డాక్టర్ గజరావు భూపాల్ సింగ్, జే బ్రహ్మారెడ్డి, ఇన్‌చార్జి ట్రాఫిక్ డీసీపీ టీ రామప్రసాదరావు, ఈషా యోగా ఫౌండేషన్ అధ్యాపకురాలు పావని, కో-ఆర్డినేటర్ జీ శ్రీనివాసరావు, వలంటీర్లు, కమిషనరేట్ అధికారులు పాల్గొన్నారు.

ఈవ్‌టీజర్లకు కౌనె్సలింగ్
విజయవాడ (క్రైం), జూన్ 21: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో యువతులు, మహిళలపట్ల అసభ్యకర ప్రవర్తనకు పాల్పడుతున్న ఈవ్‌టీజర్లకు నగర పోలీసుశాఖ ఆధ్వర్యాన కౌనె్సలింగ్ నిర్వహించారు. వాసవ్య మహిళా మండలిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈవ్‌టీజర్లకు క్రైం డీసీపీ షరీన్ బేగం హితబోధ చేశారు. రోడ్లపై అకాతాయిలకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన మహిళా రక్షక్ బృందాలు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన ఈవ్‌టీజర్లను ఇక్కడకు తరలించారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 163 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకున్నారు. కమిషనరేట్‌లోని సెంట్రల్ జోన్ పరిధిలో 30మంది, ఈస్ట్‌జోన్ పరిధిలో 25మంది, సౌత్ జోన్ పరిధిలో 47మంది, నార్త్ జోన్ పరిధిలో 35మంది, వెస్ట్ జోన్ పరిధిలో 26మంది వీరిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మిత్ర సభ్యులు, కౌన్సిలర్లు, వాసవ్య మహిళా మండలి ప్రతినిధి కీర్తి, పోలీసు అధికారులు, పాల్గొన్నారు.