విజయవాడ

హోదా సాధించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూన్ 21: రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదాను సాధించేవరకు అలుపెరగకుండా పోరాడతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం విద్యార్థి సంఘాలన్నీ కలిసి జేఏసీని పునఃప్రారంభించిన సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి సంఘాలన్నీ కలిసి ప్రత్యేక హోదా సాధించటానికి తెలంగాణ ఉద్యమం మాదిరిగా పోరాటాలను ఉద్ధృతం చేస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను సమన్వయం చేసుకుంటూ విద్యార్థులంతా కలసి పోరాటం చేస్తామన్నారు. మళ్లీ జీవం పోసుకున్న జేఏసీ ఆధ్వర్యంలో నూతనోత్సాహంతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ నెల 30న అన్ని జిల్లాల్లోని విద్యార్థులు కోటి మందితో భారీ మానవహారం నిర్మిస్తామన్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడమన్నారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సూర్యారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. జూలై 5 నుండి కడపలో రాజకీయ జేఏసీ ఏర్పాటు కానుందని, భారీ మానవహారానికి సిద్ధవౌతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నేతలు, జేఏసీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.+2

యోగాతో శారీరక, మానసిక సమస్యలకు చెక్
* ఎమ్మెల్యే బోడే ప్రసాద్
కంకిపాడు,జూన్ 21: శారీరక, మానసిక సమస్యలను అధిగమించటం యోగాతోనే సాధ్యమవుతుందని శాసనసభ్యుడు బోడే ప్రసాద్ అన్నారు. గురువారం కోదండరామ కల్యాణమడపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా బ్రహ్మర్షి పత్రీజీ మార్గదర్శకత్వంలో విశాఖపట్నంకు చెందిన యోగా మాస్టర్ ఆచార్య శ్రీకృష్ణ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటలకు వరకూ ఒకరోజు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోడే మాట్లాడుతూ వ్యాయామం, శ్వాసపై ధ్యాస, యోగా తదితరాలు ప్రతిమనిషిని ఒత్తిడి నుంచి దూరం చేయటంతోపాటు మానసికోల్లాసాన్ని కలగచేస్తాయన్నారు. దీని ద్వారా క్రమశిక్షణ కూడా అలవడుతుందన్నారు. మంచి ఆరోగ్యంతోపాటు మనసు, ఆలోచనలు ఉత్తేజంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మద్దుల బాబూరావు, శివ, లక్ష్మి, లీల తదితరులు పాల్గొన్నారు. నెప్పల్లి గ్రామంలోని ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో పనిచేసే మండవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగాపై శిక్షణా తరగతులను నిర్వహించారు. శ్రీనివాస్ పలుమార్లు హైదరాబాద్, దిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో శిక్షణ పొంది పలుప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా, దాని ఆవశ్యకతను వివరిస్తూ శిక్షణ అందచేశారు. ఈడ్పుగల్లు పరిధిలోని నలంద విద్యానికేతన్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిపురస్కరించుకుని పాఠశాల సిబ్బందితో యోగా శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు యోగా చేయటంతో సిబ్బంది కూడా ఉత్సాహంగా ఉంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయిని పద్మలత తెలిపారు.