విజయవాడ

ఎమ్మెల్యే ప్రతిపాదిత రోడ్డుకు నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 21: సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రతిపాదించిన రోడ్డు నిర్మాణ అంశం తప్పించి మిగిలిన 58 అంశాలను వీఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. గురువారం డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు అధ్యక్షతన కౌన్సిల్ భవనంలోని స్టాండింగ్ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో సభ్యులు యేదుపాటి రామయ్య, ఆత్కూరి రవికుమార్, దేవినేని అపర్ణ, కె వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. 5వ అంశంగా వచ్చిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రతిపాదించిన అంశం 1వ డివిజన్‌లోని హనుమాన్ నగర్ రోడ్డునకు సీసీ రోడ్డు వేయడానికి అవసరమైన రూ. 25.29 లక్షలను కమిషనర్ నివాస్ ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల నుంచి చేపట్టాల్సిందిగా కోరుతూ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించగా, కమిటీ ఈ అంశం సమగ్రంగా లేనందున సరిచేసి పూర్తి వివరాలతో తదుపరి సమావేశానికి తీసుకురావాలని తీర్మానించారు. ఇక మిగిలిన విషయాలకు వస్తే వీఎంసీ వెహికల్ డిపోకు అవసరమైన 12మంది డ్రైవర్లు, 10 మంది క్లీనర్ సిబ్బంది అదనంగా నియమించుకోవడానికి కమిషనర్ అనుమతించినందున వారి కాంట్రాక్ట్ కాలం 10 నెలలకు గాను జీతభత్యాలకు అవసరమైన 36లక్షల రూపాయల వినియోగానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీఎంసీ పబ్లిక్ హెల్త్ సెక్షన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న 65 మంది కాంట్రాక్ట్ డైవర్ల వచ్చే జూలై 25తో తమ కాంట్రాక్ట్ కాలపరిమితి ముగుస్తున్నందున వారిని మరో 116 రోజుల పాటు వినియోగించుకునేందుకు అంటే 18 నవంబర్ వరకూ వారికి చెల్లించాల్సిన జీతాల నిమిత్తం అవసరమైన రూ. 49,66,500ల మంజూరుకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. అలాగే వీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ కెఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్, రామలింగేశ్వరనగర్ యూజీడీ ప్లాంట్, గంగిరెద్దులదిబ్బ 10 ఎంఎల్‌డీ వాటర్ వర్క్స్, సింగ్‌నగర్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ , గాంధీనగర్, కెల్‌రావు, గురునానక్ నగర్ కాలనీలో వాటర్ ప్లాంట్లకు అవసరమైన లిక్విడ్ క్లోరిన్ గ్యాస్, క్లోరిన్ సిలిండర్ నిర్వహణ చార్జీల నిమిత్తం సంవత్సరానికి అవసరమైన రూ. 49,99,400లను వినియోగించుకునేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటితోపాటు పలు జనరల్ బిల్లులు, పద్దులపై చర్చించిన కమిటీ సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.