విజయవాడ

పార్లమెంట్ సమావేశాల్లో పోరాడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), జూన్ 22: రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనికి తీసుకు వెళ్తున్న సీఎం చంద్రబాబుతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యవౌతుందని విజయవాడ పార్లమెంట్ సభుడ్యు కేశినేని శ్రీనివాస్ (నాని) అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్దికోసం రాజీనామాలు చేసిన వైకాపా ఎంపీలు ఢిల్లీలో పోరాటం చేయకుండా గల్లీలో ఏమి చేస్తారని ప్రశ్నించారు. విజయవాడలో శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో హోదా విషయంలో ఆందోళన ఉదృతం చేసే క్రమంలో వచ్చే పార్లమెంట్ సమావేశాలను మరో సారి వేదిక చేసుకోనున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు రాకుండా సమయాన్ని లెక్కించుకుని వైకాపా ఎంపీలు ఒక పద్ధతి ప్రకారం బీజేపీతో కుమ్మక్కై రాజీనామా డ్రామాలు అడుతున్నట్లు విమర్శించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అన్ని చోట్ల టీడీపీ ఘన విజయం సాధిస్తుందనే వైకాపా ఎంపీలు రాజీనామా డ్రామాలకు తెరలేపి రెండున్నర నెలలు తరువాత ఆమోదించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వైకాపా నేతలు అడుతున్న నాటకాలను గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌పై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడమే వైకాపా ఎజెండాగా పునుకుని తీవ్రకృషి చేస్తుందని, అంతేకాక రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ది పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంపై ఏవిధంగా పోరాడాలో టీడీపీ నేతలకు తెలుసన్నారు. ఇకనైన దొంగనాటకాలు అపి, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పాటుపడమని ఆయన హితవు పలికారు.

బిగెస్ట్ క్లీనెస్ట్ సిటీగా వీఎంసీ
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 22: స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో 10 లక్షల పైబడిన జనాభా కలిగిన కేటగిరిలో బిగెస్ట్ క్లీనెస్ట్ సిటీగా రాష్ట్రంలో మొదటి ర్యాంకు, దేశంలో 4వ ర్యాంకు సాధించిన వీఎంసీ శనివారం ఈ అవార్డును అందుకోనున్నది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగనున్న ఈకార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకోనున్న ఈ అవార్డు నిమిత్తం మేయర్ కోనేరు శ్రీ్ధర్, మున్సిపల్ కమిషనర్ జే నివాస్, అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, ఏఎంహెచ్‌ఓ సిహెచ్ బాబూశ్రీనివాస్ లు శుక్రవారం ఇండోర్‌లో జరిగిన రిహార్సిల్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సేవా తత్పరుడు దేవినేని నెహ్రూ

పెనమలూరు, జూన్ 22: టీడీపీ ఆవిర్భావం నుండి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత దేవినేని నెహ్రూదని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. కానూరులోని ధనేకుల కళ్యాణ మండపంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ 64వ జయంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్‌ని మంత్రి ఉమా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ ఆశయ సాధన కోసం అవినాష్ ఎల్లవేళలా కృషి చేస్తున్నాడని, అతనికి తామందరం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నెహ్రూ పేరుతో ట్రస్ట్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేయాలనుకోవటం అవినాష్ రాజకీయ భవిష్యత్తుకు శుభ పరిణామమన్నారు. రాష్ట్ర తెలుగు యువత నాయకులు అవినాష్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని నెహ్రూ జ్ఞాపకార్ధం ట్రస్ట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. స్కూల్ ఫీజులు, సేవా కార్యక్రమాలు, ట్రస్ట్ తరపున చేపడతామని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. టిడిపి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తూ టీడీపీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు బోడె ప్రసాద్, కృష్ణజిల్లా టిడిపి అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, దేవినేని రాజా, అనే్న వేణుగోపాల కృష్ణమూర్తి, ఇండో బ్రిటిష్ హాస్పిటల్ ఎండి గౌతంచౌదరి తదితరులు పాల్గొన్నారు.