విజయవాడ

ఇళ్లస్థలాలు ఇవ్వాలని ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, జూన్ 23: అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలని వైసీపీ నేత కొలుసు పార్థసారథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పునాదిపాడు గ్రామ ఎస్సీ కాలనీలో శనివారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి కంకిపాడు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్థసారథి, తుమ్మల చంద్రశేఖర్, తదితరులు తహసీల్దార్ ఎల్లారావుకి వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా సారథి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నపుడు పునాదిపాడు గ్రామంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వటానికి 6 ఎకరాలు కొన్నామని, లబ్ధిదారులను గుర్తించి కొందరికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారులకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదన్నారు. జీ+3 పేరుతో పేదల సొమ్ము దోచుకొని కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చే ఆలోచన టీడీపీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గతంలోనూ తెలుగుదేశం పాలనలో ఎన్నడూ పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. లబ్ధిదారులను గుర్తించినా పట్టాలు ఇవ్వకుండా ఇంకెంత కాలం జాప్యం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి ఇళ్లస్థలం ఇస్తామని సారథి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి బండి నాంచారయ్య, నాయకులు కిలారు శ్రీనివాసరావు, మాదు వసంతరావు, అప్పారావు, మద్దాలి రామచంద్రరావు, వేణు, తదితరులు పాల్గొన్నారు.