విజయవాడ

వీఆర్‌ఓల సభకు ఏర్పాట్లు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 23: గ్రామ రెవెన్యూ సహాయకుల ఆత్మీయ అభినందన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం అధికారులను ఆదేశించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా విజయకృష్ణన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్న సభ ఏర్పాట్లను 24న సాయంత్రానికి పూర్తిచేయాలన్నారు. రాష్ట్రంలోని 13జిల్లాల నుండి గ్రామ రెనెన్యూ సహాయకులు సుమారు 20వేల మంది హాజరుకానున్నారని వారికి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సభాస్థలి వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు పురుషులకు, మహిళలకు విడివిడిగా ఏర్పాటు చేయాలని నిరంతరం శానిటేషన్ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పొలీస్, ఇతర శాఖల అధికారులతో నమన్వయపరచుకుని ఏర్పాట్లన్నీ పూర్తిచేయాలని సూచించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంచినీటికి ఇబ్బంది లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులు 30వేల వాటర్ బాటిళ్లను సిద్ధం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ప్రతి జిల్లా నుండి వచ్చే వారికి వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు సమన్వయం పరచి వారికి తగు సమాచారాన్ని అందజేసే విధంగా జిల్లా అధికారులను ఇంచార్జులుగా నియమించామని తెలిపారు. పోలీస్ శాఖ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పోలీస్ బందోబస్తు తదితర శాఖాపరమైన అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఫ్లవర్ డెకరేషన్, బీసీ వెల్పేర్ అధికారులు స్టేజ్ సిటింగ్ ఆరేంజ్‌మెంట్స్ తదితర బాధ్యతలను నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి అన్ని శాఖల అధికార్లతో సమన్వయ పరచుకుని ఏర్పాట్లను పూర్తిచేయాలని ఇంచార్జ్ కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈకార్యక్రమంలో జాయింట్‌కలెక్టర్-2 బాబురావు, డిఆర్‌ఓ బి అంబేద్కర్, ఆర్డిఓ సిహెచ్ రంగయ్య, ఉదయ్‌భాస్కర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ వితంతువుల దినోత్సవం
* ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 23: మూఢనమ్మకాలను నిర్ములించేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉందని, ప్రత్యేకంగా వితంతువులు మూఢనమ్మకాల రూపాల్లో వేధింపులకు గురవుతున్నారని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శనివారం ప్రపంచ వితంతువులు దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల వికాస సంస్థతో పలు ఏన్‌జీఓలు వేడుకలు నిర్వహించారు. ఈవేడుకల్లో పాల్గొన్న నారాయణరావు మాట్లాడుతూ భారతదేశంలో తారాస్థాయిలో వితంతువులపై వివక్ష ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ మహిళలు తమ భార్తలను కోల్పోయిన తరువాత ఏమాత్రం వివక్షకు గురికాకుండా చూడాలన్నారు. ప్రతి స్ర్తి వారి మేలుకోసం భద్రత కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. వితంతువులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వితంతువులకు రీమ్యారేజ్ కోసం 4లక్షలు ఇవ్వాలని బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరీరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, బాల వికాస వ్యవస్థాపకులు బాల థేరిస్సా, మంజులారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.