విజయవాడ

అమ్మా నేను బిజీగా ఉన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జూన్ 23: ‘అమ్మా నేను బిజీగా ఉన్నా తరువాత మాట్లాడతా’ అంతే ఫోన్ కట్ ఐంది. మళ్లీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లికి పిడుగులాంటి వార్త అందింది. ఆ వార్త తల్లి హృదయాన్ని కలచివేసింది. తన కొడుకు ఇక ఏ ఫోన్‌కూ అందరానంత దూరం వెళ్లాడనే విషయాన్ని గ్రహించిన ఆ మాతృమూర్తి హృదయ విదారంగా రోదిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. శనివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రి వద్ద నలుగురు నదిలో పడి ప్రమాదవశాత్తు ఆశువులు బాయగా పాతబస్తీలోని సైకంవారి వీధికి చెందిన పిళ్లా రాజ్‌కుమార్ (19) ఒకడు కావడంతో ఆ ఇంట్లో, పాతబస్తీలో విషాదఛాయలు నెలకొన్నాయి. రాజ్‌కుమార్ మిక్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. శనివారం కళాశాలకని బయలుదేరిన రాజ్‌కుమార్ తన స్నేహితులైన ప్రవీణ్, చైతన్య, శ్రీనాథ్‌లతో పాటు ఫెర్రి వద్ద గల పవిత్ర సంగమం వద్ద సరదాగా ఈతకు వెళ్లారు. వారిలో ఒకరు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో జారగా అతడిని కాపాడబోయి మిగతా ముగ్గురూ మృతి చెందారు. రాజ్‌కుమార్, రామ్‌కుమార్‌లు ఇద్దరూ కవలలు. వారి తండ్రి పిళ్లా రవీంద్రనాథ్ ఓ కంపెనీలో కెమిస్టుగా పని చేస్తున్నాడు. తల్లి నిర్మల తేలప్రోలు బాపనయ్య స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుంది. అదే స్కూల్‌లో కవలలు ఇద్దరూ పదో తరగతి వరకు చదివారు. ఇంటర్ చైతన్య కాలేజీలో చేరారు. ఇద్దరికీ ఇంజనీరింగ్ సీటు రాగా రామ్‌కుమార్ ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో, రాజ్‌కుమార్ మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరారు. వారిలో రాజ్‌కుమార్ ఇలా అకాలమృతి చెందటం ఆ కుటుంబంలో, బంధువుల్లో కలవరం రేపింది. కాగా కవలలకు ఓ చెల్లి జాహ్నవి పదో తరగతి చదువుతుంది. ఎంతో బుద్ధిమంతులుగా పెరిగి పట్టుదలతో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ కవలల్లో ఒకరిని విధి వక్రించి అనంతలోకాలకు వెళ్లడం ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా నానమ్మ లలిత, అమ్మమ్మ రమణమ్మ, మేనమామ, పిన్ని ఇలా అందరూ శోకసముద్రంలో మునిగారు. వారి హృదయ వేదన పగవారికి కూడా రాకూడదు భగవంతుడా అంటూ ఆ కుటుంబం విలవిల్లాడుతుంది. సమాచారం తెలిసిన పాతబస్తీలోని బంధువులు వారింటికి వచ్చినా వారిని ఎలా ఓదార్చాలో తెలియని అయోమయస్థితిని ఎదుర్కొన్నారు. ‘అమ్మా నేను బిజీ తరువాత మాట్లాడతా’ అంటూ రాజ్‌కుమార్ ఫోన్‌లో చెప్పిన ఆఖరి మాటలు ఆ మాతృమూర్తి హృదయాన్ని గాయం చేశాయి. కొడుకు ఆఖరి మాటలను తలుచుకుంటూ ఆ తల్లి పడిన మనోవేధన వర్ణాతీతం.