విజయవాడ

సమర్థవంతమైన నాయకుడు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 16: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలన వేగవంతమైన పాలనే కాకుండా అభివృద్ధిలో కూడా వేగం ఉందని, దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పిస్తున్నామన్నారు. కేంద్రంలోని బిజెపి పాలన గ్రామీణ, పేదల, మహిళా, యువకుల, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత కల్పిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వమని తెలిపారు. ఏ దేశమైతే వీసా సైతం నిరాకరించిందో ఆ దేశాధ్యక్షుడి ఆహ్వానం మేరకు వెళ్లి అత్యున్నత సైనిక వందనం పొందిన ఘటన ప్రధాని మోడీదని, ప్రపంచం మెచ్చిన నాయకుడుగా ఆకర్షించబడుతున్న ప్రధాని మోడీపై కాం గ్రెస్ పార్టీ లేనిపోని విమర్శలు చేస్తూ ఉనికి చాటుకొంటున్న వైనం గర్హనీయమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను నెరవేర్చడమే కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇంకా ఏమైతే అవసరం ఉన్నాయో వాటినన్నింటినీ కార్యరూపంలోకి తీసుకురాగల సత్తా ఉందని కేంద్ర పట్ట్భావృద్ధి శాఖా మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వరుసగా నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్య నాయుడుకి నగర పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉద యం నగరంలోని సూర్యారావుపేటలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అభినందన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇప్పటి వరకూ దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్ పార్టీ సమాధి రాళ్లను పోలిన శంకుస్థాపన శిలాఫలకాల పాలనకే పరిమితమైందని, ఇందుకు పోలవరం ప్రాజెక్టే నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక లోటు పరిస్థితులను అధిగమించడానికి ఇప్పటికే లక్షా 40వేల కోట్ల అంచనాల విలువైన వివిధ ప్రాజెక్టులను కార్యాచరణలోకి తీసుకువచ్చిందని, రాబోయే రెం డు, మూడు సంవత్సరాల్లో వాటి ఫలితాలను మనం చూస్తామన్నారు. గత సంవత్సర ఆర్థిక లోటు అంచనాల ప్రకారం సుమారు 6వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సర లోటును కూడా 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు భర్తీ చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ హాస్పటల్‌ను ఒక మెడికల్ కళాశాలగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉన్న మెడికల్ విద్య కొరతను తీరుస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా పప్పుదినుసుల కొరత నివారించేందుకు ప్రస్తుతం ఇస్తున్న మద్దతు ధరకు మరో నాలుగొందల రూపాయలను అదనంగా ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రు లు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు, ఎంపి గోకరాజు గంగరాజు, హరిబాబు, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్, మాజీ ఎమ్మె ల్యే వెలంపల్లి శ్రీనివాస్, నగరాధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.