విజయవాడ

బయటకు రండి.. ఆడిపాడండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 12: తమ రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గురువారం నగరంలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్‌లో ‘బయటకు విచ్చేయండి.. ఆడండి’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశీయ పర్యాటకులను మరింత ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, నగరంలో కేరళ సంస్కృతీ సంప్రదాయాలు తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కేరళలోని పర్యాటక ప్రదేశాల వివరాలు తెలియజేస్తూ వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు కేరళ పర్యాటక శాఖాధికారి నందకుమార్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షిశిల్పం, భారతదేశపు మొదటి జీవవైవిధ్య మ్యూజియం, మలబార్‌కు ప్రవేశ మార్గం, జ్ఞాపకాల మార్గంలో నడక, భారతదేశపు అతిపెద్ద పర్యాటక కొనుగోలు, విక్రయ సదస్సు, చారిత్రక బంధాలతో ప్రయాణం.. వంటివి తమ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలని తెలిపారు. ప్రాంతీయ మార్కెట్‌కు చేరుకునేందుకు వ్యూహత్మక భాగస్వామ్యాలు, సదస్సులు నిర్వహించేందుకు భువనేశ్వర్, విజయవాడ, అహ్మదాబాద్, వడోదర, సూరత్, లక్నో, ఇండోర్, నాగపూర్, పూణె, ముంబైలలో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేరళకు చెందిన సంప్రదాయ సాంస్కృతిక ఉత్సవాలు, కళాప్రదర్శనలు, దాని ఆకర్షణీయ పర్యాటక ఉత్పత్తులు భాగస్వామ్య సదస్సుల ద్వారా పర్యాటక వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పారు. 40కు పైచిలుకు పర్యాటక ప్రాంతాలతో సంబంధాలు ఉన్న వ్యాపారులను ఒక్కతాటి పైకి తెస్తున్నామన్నారు. భాగస్వామ్య సదస్సులో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

మాతాశిశు పథకాల అమలు భేష్
* ఇతర జిల్లాలకు మార్గదర్శకం
* కలెక్టర్‌కు ముఖ్యమంత్రి ప్రశంసలు
విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 12: నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం జరిగిన అంగన్‌వాడీల అవగాహన, ఆత్మీయ అభినందన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతంను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో మాతాశిశు మరణాలను గణనీయంగా తగ్గిస్తూ పౌష్టికాహార లోప రహిత, రక్తహీనత రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ చేపట్టిన వివిధ పథకాలకు గాను ఆయన కితాబిచ్చారు. కృష్ణా జిల్లాలో చేపడుతున్న పథకాలను ఇతర జిల్లాలు స్ఫూర్తిగా తీసుకోవాలని నాలుగు జిల్లాల నుండి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. నాలుగు నెలల కాలంలో గర్భిణులు, బాలింతలకు అదనపు పౌష్టికాహారంతో కూడిన సజ్జలడ్డు, నువ్వుల లడ్డులను 10,921 మంది రక్తహీనత కలిగిన వారికి అందించడం ద్వారా లోపాన్ని నివారించారని, సుమారు 8,500 మంది ఊరట చెందారని ఆయన ఉదహరించారు. జిల్లాలో రెండు నెలల కాలంలో గణనీయమైన ప్రగతి సాధించటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఇదే స్ఫూర్తిని అన్ని జిల్లాలు అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు.

బందరు రోడ్డు విస్తరణకు సహకరించండి
గృహ యజమానులకు మేయర్, కమిషనర్ పిలుపు
ఇంద్రకీలాద్రి, జూలై 12: పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి అటోనగర్ బస్ టెర్మినల్ వరకు రోడ్‌ను విస్తరించేందుకు గృహ యాజనులు అందరు సంపూర్ణంగా సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ జె నివాస్, మేయర్ శ్రీధర్ గృహ యజమానులకు విజ్ఞప్తి చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కరం మార్గంగా బందరురోడ్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో సమావేశం జరిగింది. ఈసందర్భంగా మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా ఒకే మాదిరిగా విస్తరించేందుకు నిర్ణయం జరిగిందన్నారు. చెక్ పోస్ట్ నుండి 120 అడుగులు విస్తరిస్తారన్నారు. నగర పాలక సంస్ధ ఆర్ధిక పరిస్ధితుల కారణంగా నగదు రూపేణా కాకుండా టిడిఆర్ బాండ్‌లను భవన యాజమానులకు అందచేస్తామన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ టి లక్ష్మణరావు, డెప్యూటీ ప్లానర్ ధర్మారావు, జగదీష్, బాలాజీ , టిపిఎస్ పద్మావతి, రాజన్, గిరి, మురళీ, ఏడుకొండలు, గృహ యజమానులు పాల్గొన్నారు.